https://oktelugu.com/

Telangana : రేవంత్ ఫైర్.. కేటీఆర్ వైల్డ్ ఫైర్.. అసెంబ్లీలో ఎవరూ తగ్గట్లేదే!

Telangana : న్యూటన్ మహాశయుడు ప్రతిపాదించిన నియమాలలో మూడో దాంట్లో చర్యకు ప్రభుత్వ చర్య ఉంటుందని వెల్లడించాడు. గురువారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో అదే నిరూపితమైంది.

Written By: , Updated On : March 27, 2025 / 07:30 PM IST
Revanth Reddy-KTR

Revanth Reddy-KTR

Follow us on

Telangana : భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. అనేక కేసులు నమోదు చేసి వేధించింది. తద్వారా కెసిఆర్ లేని ప్రత్యర్థిని సృష్టించుకున్నారు. కెసిఆర్ కంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. మీడియాను.. సోషల్ మీడియాను విజయవంతంగా వాడుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రతి అడుగును బలంగా వేసుకున్నారు. ఫలితంగా ముఖ్యమంత్రి అయ్యారు. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవ్వాలంటే చాలా అవరోధాలు ఎదుర్కోవాలి. అధిష్టానాన్ని మచ్చిక చేసుకోవాలి. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి సులభంగానే చేసుకోగలిగారు. తెలంగాణ ఇచ్చిన 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రాగలిగారు. తను కూడా ముఖ్యమంత్రి అయ్యారు. మొత్తంగా తనను ఇబ్బంది పెట్టిన భారత రాష్ట్ర సమితిపై తనదైన మార్క్ రాజకీయాలను చేస్తున్నారు. కెసిఆర్ నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు తన అస్త్రాలను సంధిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో నాడు తనను జైల్లో పెట్టి భారత రాష్ట్ర సమితి నాయకులు ఎలా ఇబ్బంది పెట్టారో వివరించారు.. అంతేకాదు తనను ఎంతలా వేధింపులకు గురి చేశారో భావోద్వేగానికి గురై మాట్లాడారు. మొత్తం గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారి తీశాయ్. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను వైల్డ్ ఫైర్ గా కాంగ్రెస్ నాయకులు అభివర్ణించారు.

Also Read : పెద్దాయన కేసీఆర్ ను ఖతం చేయాలని చూస్తున్నరు.. సీఎం రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు

కేటీఆర్ వైల్డ్ ఫైర్

రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత.. శాసనసభ తాత్కాలిక స్పీకర్ కూనంనేని సాంబశివరావు కేటీఆర్ కు అవకాశం కల్పించారు. కేటీఆర్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వైల్డ్ ఫైర్ లాగా శాసనసభలో మాట్లాడారు..” రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి.. సభ అధ్యక్షుడు కాబట్టి మీరు అవకాశం ఇచ్చారు. ఆయన మైక్ కట్ కాదు కాబట్టి ఎంతసేపైనా మాట్లాడారు. ఆయన అలా ఎన్నిసార్లు మాట్లాడినా మాకు ఇబ్బంది లేదు. రేవంత్ రెడ్డి ఇటీవల జరిగిన అనేక రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. 59 వేల ఉద్యోగాలు ఇస్తేనే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయమని అడిగారు. ఎలాంటి ఫలితం వచ్చిందో చూసాం. రేవంత్ రెడ్డి దీవెనలే మాకు ఆశీర్వాదాలు. ఇంతకుమించి మాట్లాడటానికి ఏమీ లేదు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి ఇంత ఫ్రస్టేషన్ ఎందుకో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి గారు కాస్త తన ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఆలోచనతో మాట్లాడాలి. రేవంత్ రెడ్డి ఇలానే వ్యవహరిస్తే ఇంకో 20 సంవత్సరాలు వరకు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎవరూ ఓటు వేయరు. ఆయన ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఈ సభా వేదికగా అంత ఆవేశంగా మాట్లాడటం సరికాదని” కేటీఆర్ వ్యాఖ్యానించారు. మొత్తంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ చేసిన సుదీర్ఘ ప్రసంగాలతో తెలంగాణ అసెంబ్లీలో పోటాపోటీ చర్చ సాగింది.

Also Read : కొడంగల్ లో రేవంత్ గెలవడు.. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావు