Tamil Nadu Old Man- Asian Bodybuilding: మనసుంటే మార్గముంటుంది. చీకటిని చూసి తిట్టుకునేకంటే ఆ చీకటిలో ఓ చిరుదీపం వెలిగించడం మంచిది ఇది చైనా సామెత. ఏదైనా సాధించాలనే తపన ఉంటే కంటి మీద కునుకుండదు. అది నెరవేరే వరకు తమ అవిశ్రాంత పోరాటం కొనసాగించడం తెలిసిందే. అలా చేసిన వారే జీవితంలో తమ ఆశయాలు నెరవేర్చుకుంటారు. విజయాలను అలవోకగా అందుకుంటారు. అలాంటి వారిలో చాలా మంది ఉన్నారు. తాము అనుకున్నది సాధించాలనే తపనతో ఎంతటి కష్టమైనా భరిస్తారు. ఎన్ని అవాంతరాలైనా అధిగమిస్తారు. జీవిత ఆశయం నెరవేర్చుకుంటారు. అందరి చేత శభాష్ అనిపించుకుంటారు.

ఈ నేపథ్యంలో బాడీ బిల్డింగ్ పోటీల్లో ఓ వృద్ధుడు యువకులతో పోటీపడుతున్నాడు. 72 ఏళ్ల వయసులో కండలు తిరిగే దేహంతో పోటీలకు సిద్ధమవుతున్నాడు. అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోటీకి వయసు కాదు మనసే ప్రధానమని నమ్మి తన కసరత్తు కొనసాగిస్తున్నాడు. కండలు తిరిగే ఒళ్లు.. ఆయన ఆశయానికి బాటలు వేస్తున్నాయి. ఏడు పదుల వయసులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాడంటే వయసులో ఇంకెంత అని అందరు తదేకంగా చూస్తున్నారు.
Also Read: Sai Pallavi: సాయి పల్లవికి ఇంత ఫాలోయింగా..? ఈ వైరల్ వీడియో చూడాల్సిందే
ఇండియన్ అర్నాల్డ్ గా పిలువబడుతున్న రతనం. యువకులకు పోటీ ఇస్తూ కసరత్తులు. అబ్బురపరుస్తున్న వృద్ధుడు. అయినా తగ్గకుండా ఆసియా బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపికై అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఏడు పదుల వయసులో కూడా ఇలా చేయడమేమిటని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. కానీ ఆయన తపన చూసి మంత్రముగ్గులవుతున్నారు. తనకు తమిళనాడు డీజీపీ శైలేంద్ర బాబు ఆదర్శనమి చెబుతున్నాడు.

మొత్తానికి ఇతని తపన చూస్తుంటే పతకం తీసుకొచ్చేలా ఉన్నాడు. ఇంత వయసులో కూడా కసరత్తులు అలవోకగా చేస్తున్నాడు. అందరు అతడినే చూస్తున్నారు. ఏ మాత్రం తడబడకుండా ఆగకుండా నిత్యం రెండు పూటలా కసరత్తులు చేస్తూ అబ్బురపరుస్తున్నాడు. తనకు తానే పోటీ తనకెవరు సాటి అంటూ కండల దేహం చూపిస్తున్నాడు. రతనం ఆశ తీరి పతకంతో తిరిగి రావాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
దీంతో ఆ వృద్ధుడు రోజు జిమ్ కు వెళుతూ తన బాడీ బిల్డింగ్ పై శ్రద్ధ పెడుతున్నాడు. దీంతో జిమ్ నిర్వాహకులు సైతం ఆశ్చర్యపడుతున్నారు. ఇంత వయసులో ఈయన బాడీ బిల్డింగ్ మీద ఇంత తాపత్రయపడుతున్నారని అదే పనిగా చూస్తున్నారు. అయినా ఇవేమీ లెక్క చేయకుండా ఆయన తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. త్వరలో జరిగే ఆసియా బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రాతినిధ్యం వహించి పతకం గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.
Also Read:Weak Human Relationships: బంధాలు బలహీనం.. మాయమవుతున్న మనిషి..!