Surya Remuneration In Vikram Movie:దాదాపుగా నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కమల్ హాసన్ విక్రమ్ సినిమా తో మన ముందుకి వచ్చిన సంగతి మన అందరికి తెలిసిందే..భారీ తారాగణం తో 120 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్..ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ కేవలం హీరో గా నటించడం మాత్రమే కాకుండా,ఈ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు..తన సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటెర్నేషన్స్ ద్వారా ఈ సినిమాని తెరకెక్కించాడు కమల్ హాసన్..చాలా కాలం నుండి ఒక్క సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న కమల్ హాసన్ కి ఈ సినిమా అటు హీరోగా ఆయన ఇమేజి ని పెంచడం మాత్రమే కాకుండా..నిర్మాత గా కూడా కాసుల వర్షం కురిపించింది..కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం రికవరీ అయ్యింది అంటే,విక్రమ్ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు..ఇది ఇలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also Read: Anirudh: అది ఒక పీడకల అనుకొని మర్చిపోతాను
అదేమిటి అంటే ఈ సినిమా మొత్తం ఒక్క ఎత్తు అయితే..చివరి 5 నిమిషాలలో తమిళ స్టార్ హీరో సూర్య ఎంట్రీ సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోయింది అనే చెప్పాలి..ఆయన ఎంట్రీ రాగానే థియేటర్ మొత్తం అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది..ఒక్క మాట లో చెప్పాలి అంటే ఈ సినిమా ఈరోజు ఈ స్థాయిలో విజయం సాధించడానికి ముఖ్య కారణాలలో హీరో సూర్య కూడా ఒక్కడు..ఇప్పుడు సోషల్ మీడియా అంతటా ఎక్కడ చూసిన సూర్య పోషించిన ఆ రోలెక్స్ పాత్ర గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు..కేవలం 5 నిమిషాల పాత్రతో సూర్య అల్లకల్లోలం సృష్టించేసాడు..అలాంటి పాత్ర చేసిన సూర్య ఈ సినిమా కోసం కనీసం ఒక్క రూపాయి పారితోషికం తీసుకోలేదు అట..కమల్ హాసన్ పక్కన కనిపించడమే గొప్ప అదృష్టం..ఇక రెమ్యూనరేషన్ ఎందుకు అని అన్నాడట సూర్య..అయితే కమల్ హాసన్ మాత్రం సినిమా భారీ విజయం సాధించి బాక్స్ ఆఫీస్ పరంగా ఇండస్ట్రీ హిట్ వైపు పరుగులు తీస్తూ ఉండడం తో, సూర్య కి తన తరుపున 5 కోట్ల రూపాయిలు విలువ చేసే కార్ ని గిఫ్ట్ గా ఇచ్చాడట కమల్ హాసన్..ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Also Read: Nagarjuna Quitting Bigg Boss: బిగ్ బాస్ కు నాగార్జున గుడ్ బై.. కారణం అదే?
[…] Also Read: Surya Remuneration In Vikram Movie: విక్రమ్ సినిమాలో 5 నిమిష… […]
[…] Also Read: Surya Remuneration In Vikram Movie: విక్రమ్ సినిమాలో 5 నిమిష… […]