Surya Kumar Yadav
Surya Kumar Yadav : ప్రపంచంలో ఎన్నో జట్లు క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. భారత ఆటగాళ్లు మాత్రమే అత్యంత ధనవంతులుగా కనిపిస్తుంటారు. బోర్డు ఇచ్చే వేతనంతో పాటు ప్రకటనలతో సంపాదించే డబ్బులు ఎక్కువగా ఉండటంవల్ల క్రికెటర్లు అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ అత్యంత ధనవంతుడైన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. అతడి సంపాదన ఫుట్ బాల్ ప్లేయర్లకు దరిదాపులో ఉంటుంది. ఇక టీమ్ ఇండియాలో సూర్య కుమార్ యాదవ్ సంపాదన కూడా ఒక రేంజ్ లోనే ఉంది. అందువల్లే అతడు ముంబైలో గోద్రెజ్ సంస్థ నిర్మించిన అపార్ట్మెంట్లలో రెండు ప్లాట్లను కొనుగోలు చేశాడు. ముంబైలోని డియోనార్ ప్రాంతంలో సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) సతీమణి దేవిషా యాదవ్ పేరుమీద గోద్రెజ్ స్కై టెర్రసెస్ ప్రాంతంలో రెండు అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. 21.1 కోట్లు అని తెలుస్తోంది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లో నమోదైన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం ఆ అపార్ట్మెంట్లలో ప్లాట్ల విలువ 21.1 కోట్లు అని తేలింది. గోద్రెజ్ స్కై టెర్రస్ ప్రాజెక్టులో అపార్ట్మెంట్లో ఈనెల 21వ రిజిస్ట్రేషన్ చేశారు. వరుసగా రెండు అంతస్తులు దేవిషా యాదవ్ సొంతం చేసుకున్నారు..
Also Read : విరాట్ కోహ్లీ నటించిన ఏకైక సినిమా అదేనా? ఇన్ని రోజులు గమనించలేదుగా!
విస్తీర్ణం ఎంత అంటే..
రెండు ప్లాట్ల కార్పెట్ ప్రాంతం విలువ సుమారు 4,222.7 చదరపు అడుగులు. మొత్తం ప్రాంతం 4,568 చదరపు అడుగులని తెలుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం ఆరు రిజర్వ్డ్ కార్ పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. ప్లాట్లు కొనుగోలు నిమిత్తం స్టాంప్ డ్యూటీ కింద 1.26 కోట్లను దేవిషా యాదవ్ చెల్లించారు. రిజిస్ట్రేషన్ ఫీజు కింద 30000 చెల్లించారు. సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం ఐపిఎల్ లో ముంబై జట్టు తరఫున ఆడుతున్నాడు
ఐపీఎల్ కెరియర్ లో మొత్తం 151 మ్యాచ్ లను సూర్య కుమార్ యాదవ్ ఆడాడు. 32.35 సరాసరితో , 144.98 స్ట్రైక్ రేట్ తో 3,623 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలున్నాయి. ఐపీఎల్ లో అతడు 387 ఫోర్లు, 131 సిక్స్ లు కొట్టాడు. ఇక ఫీల్డర్ గా 68 క్యాచ్ లు అందుకున్నాడు. టి20 లలో టీమిండియా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 77.27 విన్నింగ్ పర్సంటేజ్ తో విజయవంతమైన నాయకుడిగా కొనసాగుతున్నాడు. ఇటీవల సూర్య కుమార్ ఆధ్వర్యంలో టీమిండియా ఒక్క ఓటమి కూడా లేకుండా టి20 ట్రోఫీలను గెలుచుకుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లపై వరుసగా విజయాలు సాధించి నాలుగు ట్రోఫీలను సొంతం చేసుకుంది. సూర్యకుమార్ ఆధ్వర్యంలోని టీమిండియా ప్రస్తుతం టి20లలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో విజేతగా నిలిచిన టీమ్ ఇండియా..ఆ ఏడాదిని టి20 లలో విజయవంతంగా ముగించింది.
Also Read : ఉప్పల్ లో ఆడే ఒక్క మ్యాచ్ కు SRH ఎంత చెల్లిస్తుందో తెలుసా?