Turkish actor lookalike a Virat Kohli
Virat Kohli : ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ చూసే అభిమానులు అమితంగా ఇష్టపడే ఆటగాళ్లలో ఒకరు విరాట్ కోహ్లీ(Virat Kohli). వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్ మెన్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న కోహ్లీ సినిమాలో కూడా నటించాడా అని ఆయన వీరాభిమానులు ఆశ్చర్యపోతున్నారు. కోహ్లీ అనేక కమర్షియల్ యాడ్స్ లో నటించాడు. ఆయనతో పాటు పలువురు హీరోయిన్స్ కూడా ఆ కమర్షియల్ యాడ్స్ లో నటించే ఛాన్స్ అందుకున్నారు. చూసేందుకు హీరో లుక్స్ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఉండే కోహ్లీ, సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని ఆయన అభిమానులకు ఏ సందర్భంలో అయినా అనిపించి ఉండొచ్చు. కానీ వాళ్లంతా సోషల్ మీడియా లో తెగ పచార్లు కొడుతున్న ఒక ఫోటో ని చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీ ఏంటి ఈ గెటప్ లో ఉన్నాడు, ఇదేమి కమర్షియల్ యాడ్ కాదే, ఈయన మనకు తెలియకుండా సినిమాల్లో కూడా నటించాడా అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : ఊచకోత.. పెను విధ్వంసం.. ప్రారంభంలోనే ఐపీఎల్లో రికార్డుల మోత..
సోమవారం నాడు రెడ్దిట్ యాప్ లో టర్కిష్ నటుడు కావిట్ సెటిన్ గునర్ నటించిన ‘దిరిలిస్ : ఎట్రుగల్’ అనే వెబ్ సిరీస్ లోని ఒక సన్నివేశానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ని షేర్ చేస్తూ ‘అనుష్క శర్మ(Anushka Sharma) భర్త వెబ్ సిరీస్ లోకి అరంగేట్రం చేసాడు’ అంటూ ఫన్నీగా ఒక పోస్ట్ పెట్టాడు. అచ్చు గుద్దినట్టు విరాట్ కోహ్లీ లుక్స్ తో కనిపించడం అందరూ నిజంగానే విరాట్ కోహ్లీ అనుకున్నారు కానీ, అది ఆయన కాదు. ఆ సిరీస్ లో కోహ్లీ పోలికలతో ఉన్న ఒక నటుడు మాత్రమే. ఈ సిరీస్ ని చూసిన అనేక మంది నెటిజెన్స్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ టర్కిష్ వెబ్ సిరీస్ లో విరాట్ కోహ్లీ కి ఏమి పని అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇతనికి నెటిజెన్స్ ‘టర్కిష్ కోహ్లీ’ అనే నామకరణం కూడా చేసేసారు.
మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచం లో 7 మంది ఉంటారు అంటూ పెద్దలు చెప్పే మాటలు ఒక్కోసారి అతిశయం అని అనుకుంటాము కానీ, ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళు చెప్పిందే నిజమే కదా అని అనిపించక తప్పదు. ఈమధ్య కాలం లో బాడీ డబుల్స్ కాన్సెప్ట్ ని కూడా సినిమాల్లో తెగ వాడేస్తున్నారు. హీరోలు షూటింగ్ కి అందుబాటులో లేని సమయంలో, హీరో లుక్స్ కి దగ్గరగా ఉండే వ్యక్తులు ఏరికోరి వెతికి మరీ పెట్టుకొని షూటింగ్స్ ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకవేళ విరాట్ కోహ్లీ అభిమానులు తమ అభిమాన క్రికెటర్ ని సినిమాల్లో కూడా చూడాలని అనుకుంటే, ఈ టర్కిష్ కోహ్లీ తో పని కానిచ్చేయండి అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
Also Read : నిలిచిపోయిన ఫోన్ పే చెల్లింపులు.. కారణమిదే