Uppal
Uppal : లక్ష సీటింగ్ కెపాసిటీ ఉంటే గాని.. హైదరాబాదీయులను.. ఇతరులను సంతృప్తి పరిచే సామర్థ్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఉంటుంది. ఉప్పల్ మైదానానికి అంత సామర్థ్యం లేదు. పైగా ఐపీల్ సమయంలో ప్రతి సందర్భంలోనూ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది. టికెట్ల విషయంలో.. కల్పించే సౌకర్యాల విషయంలో.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు మీడియాలో నానుతూ ఉంటారు. విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు.. అయితే చాలామందికి ఐపీఎల్ సమయంలో హైదరాబాదులో జరిగే మ్యాచ్ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు ఏమాత్రం సంబంధం ఉండదు. చదువుతుంటే ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది ముమ్మాటికి నిజం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు మాత్రమే కాదు.. ఐపీఎల్ కు సంబంధించి ఏ వ్యవహారంతోనూ బీసీసీఐకి కూడా సంబంధం ఉండదు. ఐపీఎల్ కు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని ఐపీఎల్ గవర్నింగ్ బాడీ చూసుకుంటుంది.
Also Read : లక్నో కాసుకో ఇక.. సన్ రైజర్స్ “300” కొట్టేస్తుందా?
ప్రతి మ్యాచ్ కు ఎంత చెల్లిస్తుందంటే..
హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సొంతమైదానంగా ఉంది. హైదరాబాద్ ప్రజలు క్రికెట్ అంటే చెవి కోసుకుంటారు. ఇక ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో అయితే చెప్పాల్సిన పనిలేదు. టికెట్లు అందుబాటులోకి పెడితే హాట్ కేకులలాగా అమ్ముడుపోతుంటాయి. ఐపీఎల్ సమయంలో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణ మొత్తం సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం చేతిలోనే ఉంటుంది. టికెట్ల ముద్రణ నుంచి మొదలు పెడితే విక్రయం వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యమే చూసుకుంటుంది. హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో నిర్వహించే ప్రతి ఐపీఎల్ మ్యాచ్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు 1.5 కోట్ల అద్దె చెల్లిస్తుంది. విద్యుత్ బిల్లులు ఇందుకు అదనం. అయితే హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో సోలార్ ప్యానల్స్ ఎక్కువగా ఉంటాయి. సోలార్ పవర్ తో నడిచే ఫ్లడ్ లైట్స్ కూడా ఉన్నాయి. ఐపీఎల్ మ్యాచ్ లకు అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చిన ఆదాయాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అభివృద్ధికి ఖర్చు చేస్తుంది. బీసీసీఐ ఇచ్చే నిధులను క్రికెట్ విస్తరణకు ఉపయోగిస్తుంది. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సరిపకపోవడంతో హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీ స్టేడియం నిర్మించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బాధ్యులు.. స్థలం ఏర్పాటకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు. దానికి రేవంత్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేశారు. అతి త్వరలో హైదరాబాద్ మహానగరం శివారులో అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏర్పాటు కాబోతోంది.
Also Read : రాజస్థాన్ కే కాదు మిగతా 8 జట్లకూ SRH హెచ్చరిక ఇది.