Tanikella Bharani: టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనికెళ్ల భరణికి మంచి గుర్తింపు ఉంది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఇంటి పెద్దగా, కామెడీయన్ గా, విలన్ గా తనికెళ్ల భరణి ఎన్నో సినిమాలు నటించారు, నటిస్తూనే ఉన్నారు. తన నటన వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందనే సంఘటనను తనికెళ్ల భరణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తనికెళ్ల భరణి సినిమాల్లో ఎలాంటి వేషాలు వేసినప్పటికీ వ్యక్తిగతంగా ఆధ్యాత్మికకు అధిక ప్రాధాన్యం ఇస్తుంటన్న సంగతి అందరికీ తెల్సిందే. శివుడిపై కీర్తనలు, పాటలు రాయడమే సొంతంగా అలపిస్తూ శివభక్తులను రంజింపజేస్తుంటారు. ‘నాలోన శివుడు గలడు.. నీలో శివుడు గలడు.. నాలో శివుడు, నీలోన శివుడు లోకాన్ని ఎలాగలడు..’ అంటూ ఆయన పాడిన పాట శివుడిపై తనకు ఉన్న భక్తిని చాటిచెప్పింది.
ఇక తన నటన జీవితంలో ‘ఊహ’ సినిమా ఎన్నటికీ మరిచిపోలేనని ఆయన చెప్పారు. ఈ సినిమా తనకు ఎంతో గుర్తింపు తీసుకొచ్చిందో అదే స్థాయిలో మహిళల్లో చెడ్డపేరు తీసుకొచ్చిందని తెలిపారు. ఈ సినిమాలో ఊహ బావ క్యారెక్టర్లో నటించిన తనికెళ్ల భరణి ఆమెను రేప్ చేసి మెడలో తాళి కడుతాడు. ఆ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
అయితే ఈ సినిమా చూసిన మహిళలు మాత్రం తాను బయట కనబడితే చీదరించుకునేవారని బాధపడ్డారు. కొందరు రాళ్లతో దాడి చేశారని నాటి భయంకర రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. అది సినిమాలో సన్నివేశమని వారికి వివరించిన వినిపించుకునే వాళ్లు కాదని చెప్పారు. అంతలా ప్రేక్షకులు సినిమాలోని క్యారెక్టర్లో లీనమైపోతుంటారని తనికెళ్ల భరణిలో ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ బీజీబీజీగా గడుపుతున్నారు.