Homeఎంటర్టైన్మెంట్Ramesh Babu-Mahesh Babu bond: రమేష్ బాబు-మహేష్ బాబు బంధంపై త్రిక్రవిక్రమ్ ఏమన్నాడంటే?

Ramesh Babu-Mahesh Babu bond: రమేష్ బాబు-మహేష్ బాబు బంధంపై త్రిక్రవిక్రమ్ ఏమన్నాడంటే?

Ramesh Babu-Mahesh Babu bond: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు(56) శనివారం రాత్రి 10:30 గంటలకుతుదిశ్వాస విడిచారు. ఆదివారం రమేష్ బాబు అంత్యక్రియలను కరోనా ఆంక్షల మధ్యే కుటుంబ సభ్యులు నిర్వహించాల్సి వచ్చింది. రమేష్ బాబు సోదరుడైన సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా సోకడంతో  హోం ఐసోలేషన్లోకి వెళ్లడంత ఆయన రమేష్ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద చాయలు నెలకొన్నాయి.

Tollywood Actors
Trivikram

రమేష్ బాబు మృతిపై ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. రమేష్ బాబు ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ బాధను మరిచిపోయే మనోధైర్యాన్ని దేవుడి కృష్ణ ఫ్యామిలీకి ఇవ్వాలంటూ పలువురు ప్రార్థించారు. రమేష్ బాబు మృతి వార్త దవానంలా వ్యాపించడంతో నిన్నంతా రమేష్ బాబుకు సంబంధించిన వార్తలే దేశ వ్యాప్తంగా ట్రెండింగ్ లో నిలిచాయి.

తన అన్న రమేష్ బాబును చివరిచూపు చూడలేకపోయిన మహేష్ చాలా ఎమోషనల్ అయ్యారు. సోషల్ మీడియా వేదిక ఓ ట్వీట్ ను చేయగా అది క్షణాల్లో వైరల్ అయింది. “నువ్వే నా ఆదర్శం.. నువ్వే నా ధైర్యం.. నువ్వే నా బలం.. నా కొరకు నువ్వు చేసిన ప్రతి పనికి కృతజ్ఞతలు.. నువ్వు లేకపోతే నేను సగం మాత్రమే ఉన్నట్లు.. ఇక నుంచి నువ్వు కేవలం విశ్రాంతి తీసుకో.. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను.. మిస్ అవుతున్నాను అన్నయ్య” అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశాడు.

రమేష్ బాబు-మహేష్ బాబు అనుబంధంపై డైరెక్టర్ త్రివిక్రమ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. త్రివిక్రమ్ మహేష్ బాబు ‘అతడు’, ‘ఖలేజా’ మూవీలు చేశాడు. ఈ రెండు సినిమాల్లోనే మహేష్ బాబును త్రివిక్రమ్ సరికొత్తగా చూపించారు. ‘ఖలేజా’ షూటింగ్ సమయంలో రమేష్ బాబుకు జ్వరం వచ్చిందని చెప్పారు. మహేష్ బాబు ఓ ఫోన్ కాల్ మాట్లాడాక డల్ గా కన్పించగా ఏమైందని అడిగినట్లు త్రివిక్రమ్ చెప్పారు.

దీనికి మహేష్ స్పందిస్తూ తన అన్నకు జ్వరంగా ఉందని చెప్పారన్నారు. అప్పుడు షూటింగ్ ఆపేద్దామని చెప్పగా  తానే వద్దని వారించారని చెప్పారు. భారీ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతకు నష్టం కలుగకూడదని ఆ బాధతోనే షూటింగ్ చేశారని చెప్పారు. షూటింగ్ పూర్తయిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి రమేష్ బాబును బాగోగులు చూసుకున్నారని నాటి సంఘటనలను గుర్తుచేశారు. రమేష్ ఆరోగ్యంపై మహేష్ బాబు ఎప్పటికపుడు ఆరా తీసేవారని, వీరిద్దరు షూటింగ్ సమయంలోనే కాకుండా బయట కూడా చాలా సన్నిహితంగా ఉంటారని త్రివిక్రమ్ చెప్పారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version