Social Media Obscene Content Problem: ఒకప్పుడు సోషల్ మీడియాను చూస్తుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యంత దారుణమైన దృశ్యాలు.. దరిద్రమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. దీంతో చాలా వరకు దేశాలు సోషల్ మీడియాను కట్టడి చేయాలని.. ఒక స్థాయి వరకే పరిమితం చేయాలని చెబుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: అక్కినేని నాగ చైతన్య కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఆందోళనకు గురి చేస్తున్న వీడియో!
సోషల్ మీడియాలో “పెద్దలకు మాత్రమే” పరిమితమయ్యే సన్నివేశాలు.. దృశ్యాలు తీవ్రమైన కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్ ఎక్స్, యూట్యూబ్ ఇటువంటి సామాజిక మాధ్యమ వేదికలలో అశ్లీల కంటెంట్ యదేచ్చగా దర్శనమిస్తోంది.
వాస్తవానికి ఇటువంటి బూతు కంటెంట్ గుర్తించడానికి సోషల్ మీడియా సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆల్గారిథాన్ని ఉపయోగిస్తుంటాయి. అయితే కొంతమంది ఏఐ ఆల్గారిథాన్ని కూడా మోసం చేస్తున్నారు. తాము పోస్ట్ చేసే వీడియోలకు రకరకాల ఫిల్టర్లు వాడుతున్నారు. అసభ్యకరమైన పదాలను నేరుగా వాడకుండా.. కోడ్ లాంగ్వేజ్ ఉపయోగించి చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ఫిల్టర్లకు చిక్కకుండా ఆటోమేటిక్ గా ఫీడ్ అవుతున్నాయి. ఇటువంటి వీడియోలు యువతను చెడు మార్గం వైపు మళ్లించేస్తున్నాయి.
టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోలు.. ఇతర అశ్లీలమైన కంటెంట్ సోషల్ మీడియాలో విపరీతంగా కనిపిస్తోంది. ట్విట్టర్లో డీప్ ఫేక్ వీడియోలు విస్తృతంగా దర్శనం ఇస్తున్నాయి. అయితే అటువంటి వాటిని కట్టడి చేయకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఇటీవల ప్రభుత్వాలు హెచ్చరించడంతో ట్విట్టర్ ఎక్స్ భారీ ప్రక్షాళనకు నడుం బిగించింది. దాదాపు 600 ఖాతాలను శాశ్వతంగా బ్లాక్ చేసింది. 3500 కి పైగా బూతు పోస్టులను పూర్తిగా తొలగించింది.
బూతు ఫీడింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ట్విట్టర్ ఎక్స్ తన పాలసీలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. కార్యక్రమంలో పరస్పర అంగీకారంతో కూడిన అశ్లీల కంటెంట్ ను అధికారికంగా అనుమతిస్తూ నిర్ణయించింది. బూతు కంటెంట్ క్రియేటర్ల ద్వారా ఫ్లాట్ఫారంకు భారీగా యూజర్ ట్రాఫిక్ వస్తోంది. దీనికి తోడు సబ్స్క్రిప్షన్ ఆదాయం కూడా లభిస్తోంది. అందువల్లే బూతు క్రియేషన్ ను పూర్తిగా తొలగించడానికి ట్విట్టర్ ఎక్స్ ఆశించిన స్థాయిలో ముందుకు రావడం లేదు.. అయితే యువత తప్పుదారి పట్టకుండా ఉండడానికి.. అశ్లీల కంటెంట్ మీద ట్విట్టర్ ఎక్స్ “ఏజ్ గేటింగ్” నే టెక్నాలజీని ఉపయోగిస్తోంది.
ఇక మెటా ప్లాట్ఫారం నిబంధనల విషయంలో కాస్త కఠినంగానే ఉంది. అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించడం లేదా ఆ తరహా ఫీడ్ ను పోస్ట్ చేసే ఖాతాలను బ్లాక్ చేస్తోంది. ఇలా చేసినప్పటికీ కొత్త కొత్త ఖాతాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఫలితంగా అశ్లీలత కొత్త రూపాలను సంతరించుకుంటుంది. కేవలం కంపెనీలు మాత్రమే కాకుండా.. యూజర్లు కూడా తమ బాధ్యతగా మిగిలితే అసభ్యకరమైన కంటెంట్ సోషల్ మీడియాలో కనిపించదని యూజర్లు అంటున్నారు. ఇటువంటి బూత్ కంటెంట్ మనకు కనిపించకుండా ఉండాలి అంటే సెట్టింగ్స్లో సెన్సిటివ్ కంటెంట్ కంట్రోల్ ఉపయోగించాలి . తద్వారా ఈ బూతు ముప్పును కాస్తలో కాస్త అరికట్టవచ్చు. ప్రభుత్వాలు కూడా కఠిన చర్యలు తీసుకుంటే.. ప్రయోజనం ఉంటుంది.