Snake Bite: లోకంలో కొన్ని విచిత్రాలు జరుగుతుంటాయి. కొన్ని అద్భుతాలు చోటుచేసుకోవడం చూస్తుంటాం. కుక్క మనిషిని కరిస్తే వింతేముంటుంది. కానీ మనిషే కుక్కను కరిస్తే వింత. కలియుగ దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్లు ఎన్నో వింతలు జరగడం చూశాం కదా. ఇప్పుడు కూడా ఇలాంటి వింతే ఒకటి చోటుచేసుకోవడం గమనార్హం. ఇక్కడ ఓ పాము బాలుడిని కరవడంతో అది చనిపోయింది కానీ బాలుడికి మాత్రం ఏం కాలేదు. దీంతో అందరు ఆశ్చర్యపోతున్నారు. బాలుడిని చూసేందుకు క్యూ కడుతున్నారు. కలియుగంలో జరిగే వింతల్లో ఇదొకటి కావడం తెలిసిందే.
బిహార్ లోని గోపాల్ గంజ్ లో జరిగిన ఓ ఘటన అందరిలో సంచలనం కలిగించింది. మథోపుర్ గ్రామంలోని రోహిత్ కుశ్వారాకు అనూజ్ కుమార్ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. రోజులాగే అతడు ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో ఓ పాము వచ్చి బాలుడిని కాటు వేసింది. తరువాత అది చనిపోయింది. బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా బాలుడికి ఏం కాలేదని వైద్యులు తేల్చారు. దీంతో అందరు హతాశులయ్యారు. పాము కరిచి అది చనిపోవడం ఓ విచిత్రంగా మారింది.
Also Read: Auction Amravati Lands: అమ్మకానికి అమరావతి భూములు.. చంద్రబాబు కు జగన్ కు ఇదే తేడా
ఇంతకీ ఈ ఘటనలో పాము చనిపోవడమేమిటి అనే సందేహాలు వస్తున్నాయి. బాలుడిని కాటేస్తే బాలుడు చనిపోవాల్సింది పాము విగతజీవిగా మారడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో బాలుడికి కూడా ఏం కాలేదు. ఇదో వింతగానే చూస్తున్నారు. పాము కాటు వేసి అదే చనిపోవడం ఓ అద్భుతంగా తోస్తోంది. బాలుడిని కాటేసిన పాము మరణించడం విచిత్రమే. కొన్ని విశేషాలు చోటుచేసుకోవడం చూస్తూనే ఉంటాం. ఇందులో భాగంగానే ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు.
దీనిపై అందరు ఆలోచనలో పడ్డారు. ఎందుకు ఇలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు. పాముకు జరిగిన పరాభవం గురించి చర్చించుకుంటున్నారు. విషయం కాస్త అందరికి తెలియడంతో అందరు వచ్చి బాలుడిని విచిత్రంగా చూస్తున్నారు. పామును చంపడం మనం భౌతికంగా చేస్తున్నా సదరు బాలుడు మాత్రం తనను కాటు వేస్తేనే చచ్చిపోవడం విడ్డూరమే. ఇలా విచిత్ర ఘటనలు జరగడం మామూలే. ఇలా కలియుగ వింతలు కొన్ని అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి. పాము కాటేయడంతో బాలుడు భద్రంగానే ఉన్నా పాము మాత్రం చనిపోవడం కొత్తగా ఉందని అందరు వచ్చి బాలుడిని వింతగా చూస్తున్నారు.
Also Read:Muslim Schemes in AP: బీజేపీకి కోపం రాకుండా “ముస్లిం పథకాలు” జగన్ నిలిపివేశాడా!?