Nayanthara- Vignesh Shivan Assets: సౌత్ ఇండియా లో విభిన్నమైన పాత్రలు చేస్తూ సూపర్ స్టార్ రేంజ్ కి ఎదిగిన స్టార్ హీరోయిన్ నయనతార..ఈమెకి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..37 ఏళ్ళ వయస్సు లో చెక్కుచెదరని అందం తో కుర్రకారుల మతి పోగొట్టే నయనతార కి ఇటీవలే తన ప్రియుడు విఘ్నేష్ తో పెళ్ళైన సంగతి మన అందరికి తెలిసిందే..బందు మిత్రులు మరియు సినీ ప్రముఖుల సమక్షం లో ఇటీవలే ఈ ఇద్దరి పెళ్లి ఘనంగా మహాబలిపురంలోని ఒక్క రిసార్ట్ లో జరిగింది..ప్రస్తుతం అమెరికా లో హనీ మూన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ జంట ఇండియా కి తిరిగి రాగానే సినిమాలతో ఫుల్ బిజీ కానున్నారు..ఇది ఇలా ఉండగా నయనతార మరియు విఘ్నేష్ లకు సంబంధించిన ఒక్క ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటి అంటే నయనతార మరియు విఘ్నేష్ ఆస్తుల విలువ సుమారు 250 కోట్ల రూపాయిల వరుకు ఉంటుందట..నయనతార సౌత్ ఇండియా లో క్రేజీ స్టార్ హీరోయిన్..ఆమెకి హీరోయిన్ గా ఎన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిందో..లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి కూడా అన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది..ఒక్కో సినిమాకి గాను ఆమె 5 కోట్ల రూపాయిల వరుకు పారితోషికం ఉంటుందట..వీటితో పాటు ఆమె ఎన్నో ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది.
Also Read: Venkatesh- Ravi Teja: వెంకటేష్ – రవితేజ కాంబినేషన్ లో మూవీ.. డైరెక్టర్ ఎవరో తెలుసా..?
వీటి ద్వారా ఆమె ఇన్నేళ్ల సుదీర్ఘమైన సినీ కెరీర్ లో బాగానే వెనకేసినట్టు సమాచారం..ఇక విఘ్నేష్ పెద్ద టాప్ డైరెక్టర్ కాకపోయినా కూడా ఉన్నంతలో బాగానే సంపాదించాడు..వీళ్లిద్దరి జాయింట్ ఆస్తులలో నయనతార వాటా 80 శాతం ఉంటె, విఘ్నేష్ వాటా కేవలం 20 శాతం మాత్రమే ఉంటుందట..దీనిని బట్టి నయనతార సినిమాల ద్వారా ఏ స్థాయిలో డబ్బులను కూడగట్టిందో అర్థం చేసుకోవచ్చు..ప్రస్తుతం నయనతార టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి తో కలిసి గాడ్ ఫాదర్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది..ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.
Also Read:Basavatarakam Hospital: బాలయ్య బసవతారకం హాస్పిటల్ కు మరో అరుదైన రికార్డ్