
Visakha Capital : వికేంద్రీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఫోకస్ పెడుతున్నారు. మూడు రాజధానులకే మొగ్గు చూపుతున్నారు. గతంలో జగన్ మూడు రాజధానుల కోసం తీసుకున్న నిర్ణయంతో గొడవ రేగినా కోర్టు మూడు రాజధానులు వద్దని చెప్పినా జగన్ మొండివైఖరితోనే ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ లో విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడం దేనికి సంకేతం. కోర్టులంటే లెక్కలేదా? కోర్టు తీర్పు అంటే జగన్ కు చేదా అనే వాదనలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ప్రకటన మళ్లీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేపనుంది. మూడు రాజధానులు వద్దని ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నా జగన్ మాత్రం మారడం లేదు. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే చందంగా ఆయన ప్రవర్తన ఉంటోంది. విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని చెప్పడంతో రాజకీయాల్లో మరోసారి సంచలనం కలగనుంది. విశాఖనే రాజధానిగా చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. విశాఖ రాజధానిగా చేస్తే రాష్ట్రం నిప్పుల కుంపటి కావడం ఖాయమే.
సెప్లెంబర్ లో ఇక్కడి నుంచి పరిపాలన చేయడమే కాదు కాపురం కూడా ఇక్కడ నుంచే అని చెప్పడంతో రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతోంది. జగన్ బలమేంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ప్రజలను విడదీసి పాలించడమే ఆయన ఉద్దేశమా? అతడి మాటల్లో దాగిన మర్మం ఏమిటనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో జగన్ మాటలకు అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

జగన్ ప్రకటనతో రాష్ట్రంలో పరిస్థితులు ఎలా మారనున్నాయి? మూడు రాజధానులకే జగన్ ఆసక్తి చూపుతున్న క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో తెలియడం లేదు. కానీ వైసీపీకి ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో భవిష్యత్ లో ఏ రకమైన ప్రభావాలు చోటుచేసుకుంటాయో అర్థం కావడం లేదు. మొత్తానికి జగన్ కు ఎదురుదెబ్బలు తగలే అవకాశాలు ఉన్నాయని అంచనా.