Homeఅంతర్జాతీయంIran underground nuclear weapons: ఇరాన్‌ భూగర్భంలో అణ్వాయుధాలు.. రహస్య గుహల్లో యుద్ధ వ్యూహం!

Iran underground nuclear weapons: ఇరాన్‌ భూగర్భంలో అణ్వాయుధాలు.. రహస్య గుహల్లో యుద్ధ వ్యూహం!

Iran underground nuclear weapons: ఇరాన్‌ ఒకవైపు.. అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు ఒకవైపు అన్నట్లుగా సాగుతున్న మీడిల్‌ ఈస్ట్‌ వార్‌.. తారాస్థాయికి చేరుతోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణించడం, ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్‌ సైనికులు మరణిస్తుండడంతో ఇరాన్‌ అస్త్ర శస్త్రాలను బయటకు తీస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌ పర్వతాల కింద 300–500 మీటర్ల లోతులో ఐఆర్‌జీసీ నియంత్రణలో ఉన్న సొరంగాల్లో క్షిపణులు, అణ్వాయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖరీద్‌ ప్రాంతంలోని ఈ నగరాలు 10 […]

Iran underground nuclear weapons: ఇరాన్‌ ఒకవైపు.. అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్‌ దేశాలు ఒకవైపు అన్నట్లుగా సాగుతున్న మీడిల్‌ ఈస్ట్‌ వార్‌.. తారాస్థాయికి చేరుతోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మరణించడం, ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో ఇరాన్‌ సైనికులు మరణిస్తుండడంతో ఇరాన్‌ అస్త్ర శస్త్రాలను బయటకు తీస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌ పర్వతాల కింద 300–500 మీటర్ల లోతులో ఐఆర్‌జీసీ నియంత్రణలో ఉన్న సొరంగాల్లో క్షిపణులు, అణ్వాయుధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఖరీద్‌ ప్రాంతంలోని ఈ నగరాలు 10 కి.మీ. పొడవున్న సురంగాలు, బంకర్లు, ఆటోమేటెడ్‌ రైలు ట్రాకులతో ఆయుధాలు ప్రయోగించేందుకు సిద్ధంగా ఉంచారు. షహాబ్‌–3, సెజ్జిల్, ఖైబర్‌ షేకాన్‌ వంటి 2 వేల కి.మీ. రేంజ్‌ బాలిస్టిక్‌ క్షేపణులు లక్షలాది సంఖ్యలో నిల్వలో ఉన్నాయి.

లాంచర్లు లేకుండా ఆధునికత
సంప్రదాయ లాంచ్‌ ప్యాడ్‌లు లేకుండా, టన్నెల్‌ ఓపెనింగ్‌ల నుంచి క్షిపణులు నేరుగా దూసుకొస్తాయి. ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్స్‌తో రహస్య కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్‌ సిగ్నల్స్‌ బయటకు రాకుండా డిజైన్‌ చేశారు. మల్టిపుల్‌ ఎంట్రీ–ఎగ్జిట్‌ పాయింట్లు, డీకాయ్‌ టన్నెళ్లు శత్రువు రాడార్లకు కూడా చిక్కవు. డ్రోన్లు, ఫైటర్‌ జెట్‌లు కూడా ఇక్కడ భద్రపర్చినట్లు సమాచారం. యుద్ధ సమయంలో క్షణాల్లో వీటిని ప్రయోగిస్తారు.

ఇటీవలి దాడుల్లో ప్రభావం
అమెరికా–ఇజ్రాయెల్‌ దాడుల సమయంలో ఈ గుడారాల నుంచి టెల్‌ అవివ్, ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌పై ఇరాన్‌ దాడి చేసింది. ఇజ్రాయెల్‌ ఐడీఎఫ్‌ టెహ్రాన్‌ సమీపంలోని మింజాదెహై భూగర్భ అణు స్థావరాలు ధ్వంసం చేసినా, ఈ మిసైల్‌ నగరాలకు నష్టం కలగలేదు. ప్రీ–ఎంప్టివ్‌ స్ట్రైక్‌లు వృథా అవుతున్నాయి, ఇరాన్‌ ప్రతిఘటన శక్తి 3–5 రెట్లు పెరిగింది.

Also Read: విశాఖలో అలరించారు.. స్వదేశానికి వెళ్తుండగా ప్రాణాలు పోగొట్టుకున్నారు

సాంకేతిక రహస్యాలు..
భారీ బంకర్‌ బస్టర్‌ బాంబులు (GBU–57) కూడా 100 మీటర్లకు మించి చొచ్చుకోలేవు. ఫార్వర్డ్‌ ఆపరేషనల్‌ టన్నెళ్లు, మొబైల్‌ లాంచర్లు గుర్తించడానికి సాటిలైట్‌ ఇమేజరీ విఫలమవుతోంది. 1990ల నుంచి కొరియా, చైనా సాంకేతిక సహాయంతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ ఐఆర్‌జీసీ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.

ఇరాన్‌ భూగర్భ మిసైల్‌ నగరాలు అసిమెట్రిక్‌ యుద్ధ వ్యూహానికి పరిపూర్ణ ఉదాహరణ. శత్రువు ప్రీ–స్ట్రైక్‌లను అసాధ్యం చేసి, డిటరెన్స్‌ బలోపేతం చేశాయి. ఇజ్రాయెల్‌ బంకర్‌ బస్టర్లు, అమెరికా సైబర్‌ దాడులు పోటీ పడుతున్నా. ఈ మోడల్‌ ఉత్తర కొరియా, చైనా లాంటి దేశాలకు మార్గదర్శకం, మధ్యప్రాచ్య సంఘర్షణల్లో ఇరాన్‌కు ఆధిక్యత ఇచ్చింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper