Homeబిజినెస్Maruti Suzuki Ertiga 7 Seater Car: లాంగ్ ట్రిప్ కోసం బెస్ట్ కార్.. బంధుత్వాలను...

Maruti Suzuki Ertiga 7 Seater Car: లాంగ్ ట్రిప్ కోసం బెస్ట్ కార్.. బంధుత్వాలను పెంచే ఈ 7 సీటర్ కారు గురించి తెలుసుకోండి..

Maruti Suzuki Ertiga 7 Seater Car: ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనులతో ప్రతి ఒక్కరు బిజీగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వీకెండ్ లేదా మంత్ ఎండింగ్ లో ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్ వేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటివారు సొంతంగా కారు ఉంటే ప్రణాళిక ప్రకారంగా విహార యాత్రలకు వెళ్ళవచ్చు. అంతేకాకుండా రెండు కుటుంబాలు కలిసి ఒకే కారులో ప్రయాణం చేస్తే బంధుత్వాలు బలపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి […]

Maruti Suzuki Ertiga 7 Seater Car: ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక పనులతో ప్రతి ఒక్కరు బిజీగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే వీకెండ్ లేదా మంత్ ఎండింగ్ లో ఫ్యామిలీతో కలిసి లాంగ్ ట్రిప్ వేయాలని అనుకుంటూ ఉంటారు. ఇలాంటివారు సొంతంగా కారు ఉంటే ప్రణాళిక ప్రకారంగా విహార యాత్రలకు వెళ్ళవచ్చు. అంతేకాకుండా రెండు కుటుంబాలు కలిసి ఒకే కారులో ప్రయాణం చేస్తే బంధుత్వాలు బలపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రావడానికి 7 సీటర్ కారు అయితే బాగా షూట్ అవుతుంది. అలాంటి 7 సీటర్ కార్లలో ఈ కంపెనీకి చెందిన మోడల్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్ సైతం కొనగలిగేలా తక్కువ ధరతో అందుబాటులో ఉంటుంది. ఇంతకీ ఆ కారు విశేషాలు ఏంటంటే?

దేశంలో కార్ల విక్రయాలలో మారుతి సుజుకి అగ్రగామిగా ఉంటూ వస్తుంది. ఈ కంపెనీ నుంచి మార్కెట్లోకి వచ్చిన 7 సీటర్ కారు Ertiga వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇది తక్కువ ధరకు ఉండడమే కాకుండా మైలేజ్ విషయంలో బడ్జెట్ కు అనుగుణంగా ఉంటుంది. అయితే ఈ కారు 2026 ఫిబ్రవరి నెలలో 17, 807 విక్రయాలు జరుపుకుంది. 2025 ఫిబ్రవరిలో 14,868 యూనిట్లు జరుపుకుంది. ఒక ఏడాదిలోని 3000 కార్లు అధికంగా విక్రయాలు జరుపుకోవడం విశేషం. దీనిని బట్టి చూస్తే ఈ కారుకు ఎంత ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: పదేళ్లలో 14 లక్షల కార్ల విక్రయాలు..SUV అంటే ఇదే అంటున్న కస్టమర్లు..

మారుతి సుజుకి ఎర్టిగా తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది. దీని ధర ప్రస్తుతం రూ.8.80 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా మైలేజ్ విషయంలో ఇది బెస్ట్ కారు అని అనిపించుకుంది. ఈ కారులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో పాటు CNG ఆప్షన్ కూడా ఉంచారు. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. లీటర్ ఇంధనానికి మాన్యువల్ గేర్ బాక్స్ తో 20.51 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా.. ఆటోమేటిక్ గేర్ బాక్స్ 20.3 కిలోమీటర్ల వరకు వెళ్లవచ్చు. CNG ఆప్షన్ లో అయితే 26.11 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కేవలం ఇంజన్ విషయంలో మాత్రమే కాకుండా ఇందులో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం తో పాటు కీ లెస్ ఎంట్రీ, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, పుష్ బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్లూ ఇస్ కంట్రోల్ వంటి ఆప్షన్ లో ఉన్నాయి. లాంగ్ డ్రైవ్ చేసేవారికి ఎలాంటి అలసట లేకుండా సీటింగ్ సౌకర్యం కంఫర్టబుల్గా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper