
Agent Movie Heroine: టాలీవుడ్ లో ప్రతీ ఏడాది కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తూనే ఉంటారు, కానీ కేవలం కొంతమందికి మాత్రమే లక్షలాది మంది ప్రేక్షకులను ఆకర్షించే శక్తి ఉంది. గడిచిన రెండేళ్లలో కృతి శెట్టి మరియు శ్రీ లీల వంటి హీరోయిన్స్ కేవలం ఒకటి రెండు సినిమాలతో మంచి క్రేజ్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి హీరోయిన్ల డేట్స్ కోసం స్టార్ హీరోలు మరియు స్టార్ నిర్మాతలు కూడా పడిగాపులు కాస్తున్నారు.
అందం తో పాటుగా అదృష్టం కూడా కలిసి రావడం తో వీళ్ళు ఇంత తక్కువ సమయం లో ఈ స్థాయికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి చేరబోతోంది మరో కొత్త హీరోయిన్ సాక్షి వైద్య. ఈమె అక్కినేని అఖిల్ ప్రెస్టీజియస్ చిత్రం ‘ఏజెంట్’ లో హీరోయిన్ గా నటించింది. ఈ నెల 28 వ తారీఖున ఈ చిత్రం విడుదల కాబోతుంది, నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చెయ్యగా దానికి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇది ఇలా ఉండగా ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు,ఈ సాక్షి వైద్య అనే అమ్మాయి చాలా బాగుంది, ఇంతకు ముందు ఈమెని ఎక్కడ చూడలేదే వంటి ఎన్నో సందేహాలు అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో కలిగాయి. ఆ తర్వాత ఈమె గురించి గూగుల్ లో వెతకగా, ఈమె 2022 వ సంవత్సరం లో ‘ఇన్వెర్స్’ అనే హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలో నటించింది.ఇదే ఆమెకి తొలి సినిమా కావడం విశేషం.

అంతకు ముందు ఈమె ఎన్నో ప్రాడెక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసింది.మహారాష్ట్ర కి చెందిన ఈ అమ్మాయి కి మొదటి సినిమాతోనే హాలీవుడ్ లో ఛాన్స్ కొట్టడం అంటే సాధారణమైన విషయం కాదు.’ఏజెంట్’ సినిమా భారీ హిట్ అయితే టాలీవుడ్ లో ఈమె జాతకమే మారిపొయ్యే ఛాన్స్ ఉంది. మరి ఈమె అదృష్టం ఎలా ఉందో తెలియాలంటే ఈ నెల 28 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.