Anthropocene Epoch: ఎప్పుడూ కన్పించని ప్రకృతి విపత్తులు పర్యావరణాన్ని కుంగుదీస్తున్నాయి. కాలుష్యం అంతకంతకూ పెరుగు తోంది. భూతాపం సెగలు కక్కుతోంది. రికార్డుల స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. మరో వైపు అకాల వర్షాలు కురుస్తున్నాయి. నదులు ఉప్పొంగుతున్నాయి. వరదలు కనీవినీ నష్టాన్ని కలగజేస్తున్నాయి. అయితే ఈ ప్రకృతివిపత్తులు ఇటీవల భారీగా పెరిగాయి. ఇవి మనిషి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అయితే మనుషుల నిర్వాకం వల్ల భూమిపై అవాంఛనీయ పరిణామాలు మొదలవడం ఎప్పుడు మొదలయిందో తెలుసా?
కొన్నేళ్లుగా పరిశోధనలు
దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా ఆంథ్రోపొసీన్ వర్కింగ్ గ్రూప్ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వారు ఇటీవల కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. 1950 మధ్య కాలం నుంచే భూమి పై అవాంఛనీయ పరిణామాలు మొదలయ్యాయి. యుద్ధాలు ముగిసి పారిశ్రామిక విప్లవాలు మొదలుకావడంతో ప్రపంచవ్యాప్తంగా దేశాలన్నీ అభివృద్ధి మీద దృష్టి సారించాయి. వనరుల వెలికితీతను యధేచ్ఛగా వెలికితీయడం ప్రారంభించాయి. మొదట్లో ఒక మాదిరిగా సాగిన ప్రక్రియ తర్వాత కొత్త పుంతలు తొక్కింది. దీనివల్ల అడవులు, కొండలు, కోనలు, నదులు, ఇలా సమస్తం ప్రభావితమవయ్యాయి. ఇలా ఏళ్లపాటు మనుషుల చర్యలను భరించిన భూ మాత.. తర్వాత తన ప్రకోపాన్ని చూపించడం మొదలు పెట్టింది. అభివృద్ధి పేరుతో మనుషులు భూ మాతను అగాథంలోకి నెట్టేసే కాలానికి శాస్త్రవేత్తలు ‘ఆంథ్రోపొసీన్’ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. మనిషి, నూతన అనే అర్థాలున్న గ్రీక్ పదాలతో ఈ కొత్త పదం ఏర్పడింది. మొదట దీనిని 1960 సంవత్సరంలో పాల్ క్రట్‌జెన్, యూగీన్ స్టార్మర్ అనే శాస్త్రవేత్తలు ఉపయోగించారు. దీనిని ప్రస్తుత ‘జియోలాజికల్ టైమ్ ఇంటర్వెల్’గా పరిగణిస్తున్నారు. ఆం రఽథోపొసీన్ వర్కింగ్ గ్రూప్ శాస్త్రవేత్తలు ఇంకా మరిన్ని కీలక అంశాలు వెల్లడించారు.
భూ ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి
ఆం రఽథోపొసీన్‌లో భాగమైన పరిణామాలు, మార్పులు, ఇతర ఉత్పరివర్తనాలకు కారణమవుతున్నాయి. ఇవి కొన్ని సంవత్సరాల వరకు కొనసాగుతాయి. ఇవి మొత్తం భూమి ఆవరణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. కొన్ని మార్పుల ప్రభావం భూమిపై శాశ్వతంగా ఉంటాయి. శిలాజ ఇంధనాల వాడకం, అణ్వాయుధాలను ఉపయోగించడం, పొలాల్లో రసాయన ఎరువుల విచ్చలవిడి వినియోగం, భూమితో పాటు నదులు, చెరువుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వంటివి ఆంథ్రోపొసీన్‌కు కారణమవుతున్నాయి. మానవుల చర్యల వల్ల భూమికి జరుగుతున్న నష్టం అనూహ్యంగా ఉందని, ఈ నష్టం రాను రాను మరింత పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌కు చెందిన జియాలజిస్ట్ కోలిన్ వాటర్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
రాక్షస బల్లులు అంతరించిన ఘటనతోనే..
సుమారు కోట్ల సంవత్సరాల క్రితం బలమైన గ్రహాలు ఢీకొనడం వల్ల భూ మ్మీద రాక్షక బల్లులు అవతరించిపోయాయి. ప్రస్తుత నవీన యుగంలో మనుషుల చర్యలు సైతం అదే విధంగా ఉన్నాయి. 1950 నుంచి భూ మ్మీద ఎన్నో రకాల జీవులు అంతరించిపోయాయి. గ్రహ శకలాలు ఢీకొట్టడం అనేది ఒక కొత్త శకానికి దారి తీసింది. మనుషుల చర్యలు కూడా కొత్త శకానికి నాంది పలికాయి. ఇప్పటికైనా మనుషులు మేల్కొని నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే భవిష్యత్‌లో మరిన్ని తీవ్ర పరిణామాలు తలెత్తుతాయి.