https://oktelugu.com/

Deepika Padukone Project K: ప్రాజెక్ట్ కే నుండి దీపికా పదుకొనె ఫస్ట్ లుక్, నిరాశపరిచిన టీమ్!

రాత్రి తొమ్మిది గంటల తర్వాత దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే ఊహించిన స్థాయిలో లేదు. క్లోజ్ అప్ షాట్ లో సాదాసీదాగా ఉన్న దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ సంతృప్తికరంగా లేదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో దీపికా ప్రీ లుక్ వచ్చింది. లేడీ వారియర్ గెటప్ లో ఆమె అద్భుతంగా ఉన్నారు. ప్రీ లుక్ ఆ రేంజ్ లో ఉన్న క్రమంలో ఫస్ట్ లుక్ గురించి చాలా ఊహించుకున్నారు.

Written By: , Updated On : July 18, 2023 / 08:12 AM IST
Deepika Padukone Project K

Deepika Padukone Project K

Follow us on

Deepika Padukone Project K: ప్రాజెక్ట్ కే చిత్ర ప్రమోషన్స్ షురూ చేశారు. విడుదలకు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. దీంతో సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న సాయంత్రం 5 గంటలకు దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ అని ప్రకటించారు. ఎంతో ఆతృతగా ఎదురు చేసిన అభిమానులకు నిరాశ ఎదురైంది. చెప్పిన టైం కి ఫస్ట్ లుక్ విడుదల కాలేదు. అనివార్య కారణాలతో దీపికా ఫస్ట్ లుక్ విడుదల చేయలేకపోయామని క్షమాపణలు కోరారు.

రాత్రి తొమ్మిది గంటల తర్వాత దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అయితే ఊహించిన స్థాయిలో లేదు. క్లోజ్ అప్ షాట్ లో సాదాసీదాగా ఉన్న దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ సంతృప్తికరంగా లేదని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. గతంలో దీపికా ప్రీ లుక్ వచ్చింది. లేడీ వారియర్ గెటప్ లో ఆమె అద్భుతంగా ఉన్నారు. ప్రీ లుక్ ఆ రేంజ్ లో ఉన్న క్రమంలో ఫస్ట్ లుక్ గురించి చాలా ఊహించుకున్నారు.

మొత్తంగా దీపికా పదుకొనె ఫస్ట్ లుక్ విషయంలో ప్రాజెక్ట్ కే టీమ్ విఫలం చెందారు. నిజానికి ఇంత హడావుడిగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు చాలా సమయం ఉంది కాబట్టి బెస్ట్ లుక్ అండ్ పోజ్ ఎంచుకోవాల్సింది. ఇదిలా ఉంటే జులై 20న ప్రాజెక్ట్ కే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. శాన్ డియాగో కామిక్ కాన్ 2023 ఈవెంట్లో ప్రాజెక్ట్ కే చిత్రానికి ఆహ్వానం దక్కింది.

ఈ గౌరవం అందుకున్న మొట్టమొదటి ఇండియన్ మూవీగా ప్రాజెక్ట్ కే రికార్డులకు ఎక్కింది. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, నాగ్ అశ్విన్ ఈ ఈవెంట్లో పాల్గొననున్నారు. జులై 20న శాన్ డియాగో కామిక్ కామ్ వేదికగా ప్రాజెక్ట్ కే టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నారు. ప్రాజెక్ట్ కే మూవీ 2024 జనవరి 12న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్, దిశా పటాని సైతం కీలక రోల్స్ చేస్తున్నారు.