Cholesterol: గత కొన్నేళ్లుగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతోంది. చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కల్తీ ఎక్కువగా ఉండే నూనెల వాడకం, వంటల్లో ఎక్కువ నూనె వినియోగించడం, శారీరక శ్రమ లేకపోవడం, బయట జంక్ ఫుడ్ కు అలవాటు పడడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వంటి అనేక ఆహారపు అలవాట్లు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగేందుకు కారణం అవుతాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ ఈ మధ్యకాలంలో తీవ్రమైన సమస్యగా పరిణమిస్తోంది. కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవాళ్లు చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ ఆహార పదార్థాలు తినకూడదు అని చెబుతుంటారు. ఇది వాస్తవమా..? కాదా..? అన్నది మీరు తెలుసుకోండి.
ఒకప్పుడు శాకాహారులు ఎక్కువగా దేశంలో ఉండేవారు. ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిన తర్వాత వారంలో కనీసం రెండు మూడు సార్లు అయినా మాంసాహారం తినకుండా ఉండలేని స్థితికి ఎంతోమంది చేరుకున్నారు. ముఖ్యంగా చికెన్ ఎక్కువగా తినే వారు చాలా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. దేశంలో 78 శాతం మంది స్త్రీలు, 70 శాతం మంది పురుషులు మాంసాహారాన్ని ఇష్టంగా తింటున్నట్లు అనేక పరిశోధనలు వెల్లడించాయి. అయితే అలాంటివారు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటే మాంసాహారాన్ని తినొచ్చా లేదా అన్నది ఇప్పటికీ చాలామందికి అనుమానం. నిపుణుల అభిప్రాయం ప్రకారం మాంసం తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అయితే చికెన్ విషయంలో ఉడికించే దాన్ని బట్టి అది ఆధారపడి ఉంటుంది అని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా చికెన్ ను చాలా ఎక్కువ సేపు నూనెలో వండితే అది కొలెస్ట్రాల్ను బాగా పెంచుతుంది. ఇక చికెను ఇష్టంగా తినేవారు చికెన్ ఫ్రై, కడాయి చికెన్, డీప్ ఫ్రై, చికెన్ వంటి వాటిని తింటే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
వండుకుని తినే విధానమే చాలా కీలకం..
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే చికెన్ వండుకుని తినే విధానమే చాలా కీలకమని నిపుణులు చెబుతున్నారు. సూపర్ చేసుకున్న నూనె లేకుండా చికెన్ ఉడకబెట్టుకుని తిన్నా, తక్కువ నూనెతో తయారుచేసిన తందూరి చికెన్, కాల్చిన బార్బీ క్యూ చికెన్ వంటివి తిన్నా ఆరోగ్యానికి హాని కలుగదు. ఎంత చికెన్ పై ఇష్టం ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇంకా కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వారానికి ఒకసారి మాత్రమే చికెన్ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు విరిగిపోయే అవకాశం, రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతే తీవ్ర ఇబ్బందులు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.