Homeట్రెండింగ్ న్యూస్Saree Run: బ్రహ్మణీ ఎంట్రీ.. ఆంటీలందరూ చీర కట్టి.. బుల్లెట్ బైకెక్కి.. నా సామిరంగా చూడాల్సిందే.....

Saree Run: బ్రహ్మణీ ఎంట్రీ.. ఆంటీలందరూ చీర కట్టి.. బుల్లెట్ బైకెక్కి.. నా సామిరంగా చూడాల్సిందే.. వైరల్ పిక్స్

Saree Run: పరుగు పందెం అనగానే మనకు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. ఒలంపిక్స్ లో హుస్సేన్ బోల్ట్ లాంటి పరుగు కళ్ళ ముందు కదలాడుతుంది. ఇవి సాధారణంగా నిర్వహించే పోటీలు. రొటీన్ కు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో వెరైటీగా ఆదివారం (మార్చి 17న) శారీరన్ నిర్వహించారు. చీరకట్టులో పరుగులు పెడుతూ మగువలు ఆకట్టుకున్నారు.

రెండు సంస్థల ఆధ్వర్యంలో..
తనైరా సంస్థ, బెంగళూరుకు చెందిన ప్రముఖ ఫిట్నెస్ కంపెనీ జేజే ఆక్టివ్ సంయుక్తంగా హైదరాబాదులో ఈ శారీరన్ నిర్వహించాయి. పీపుల్స్ ప్లాజా వద్ద నీ పోటీని హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి జండా ఊపి ప్రారంభించారు. సుమారు 3000 మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు.

Saree Run
Saree Run

సంప్రదాయ చీరకట్టులో..
పోటీలో పాల్గొన్న మహిళలు అంతా సంప్రదాయ చీరకట్టులో ఆకట్టుకున్నారు. సాధారణంగా షార్ట్ ప్యాంట్ వేసుకొని పరిగెత్తడమే కష్టంగా ఉంటుంది. కానీ 3000 మంది మహిళలు భారతీయ సంస్కృతిలో భాగమైన చీరలు ధరించి పరుగులు పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇలాంటి పోటీలు స్త్రీలకు గుర్తింపు గౌరవం తెస్తాయని నారా బ్రాహ్మణి అన్నారు. చీరకట్టు మైళ్ళకు ఉందా తనని తెస్తుందని పేర్కొన్నారు.

Saree Run
Saree Run

 

ఆత్మవిశ్వాసం పెంపే లక్ష్యంగా.
అతివల్ల ఆత్మవిశ్వాసం పెంచడమే లక్ష్యంగా, మహిళా సాధికారత స్త్రీలలో ఆరోగ్యం పై అవగాహన కల్పించడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈ పోటీలను నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన ఈ పోటీకి తనీరా శారీ రన్ అని పేరు పెట్టారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version