Nara Lokesh: నారా లోకేష్ పరిణీతి సాధించారు. మాట తీరు మారింది. హావ భావాలు మారాయి. భావవ్యక్తీకరణ కూడా మారింది. మొన్నటి వరకు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క అన్నట్టు లోకేష్ పరిస్థితి మారింది.వైసిపి చేసే విమర్శలకు దీటైన కౌంటర్లు ఇస్తున్నారు.సమయస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు. విమర్శకులకు సైతం నోళ్లు మూతపడేలా సమాధానం ఇవ్వగలుగుతున్నారు.సెటైరికల్ గా మాట్లాడుతున్నారు.
రాజకీయాల్లో లోకేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయనపై వచ్చిన విమర్శలు..మరే నాయకుడిపై రాలేదు.ఆయన ఆహారం, ఆహార్యం వరకు ప్రతి అంశాన్ని ఎత్తిచూపుతూ ఎగతాళి చేసేవారు. చివరకు వ్యక్తిగత హననానికి కూడా దిగారు. కానీ తనకు ఎదురైన రాజకీయ పరిణామాలను లోకేష్ అనుకూలంగా మార్చుకుంటున్నారు. తన మాట, నడత, నడకను మలుచుకుని మాస్ లీడర్ గా ఎదిగారు. తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్న వారికి దీటైన జవాబు ఇస్తున్నారు. ముఖ్యంగా వైసిపి పై విమర్శల డోసు పెంచారు. అటు ఎక్కడైతే ఓడిపోయారో అదే మంగళగిరిలో గెలుస్తానని ప్రతిన బూనారు. ధైర్యంగా మంగళగిరిలో మరోసారి పోటీలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్టు తనను తాను లోకేష్ మార్చుకోవడంలో సక్సెస్ అయ్యారు.ముఖ్యంగా వైసిపి పై సమయస్ఫూర్తిగా స్పందించడంలో సక్సెస్ అవుతున్నారు. వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చిన సంగతి తెలిసిందే. నిన్న ఏకంగా తుది జాబితాను ప్రకటించారు. అదే సమయంలో లోకేష్ స్పందించారు. మునిగిపోతున్న నావలో ప్రయాణికుల జాబితా చదువుతున్నట్లు ఉందని ఏద్దేవా చేశారు. దీనిని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.తమకు అలవాటైన పాత విమర్శలను బయటకు తీస్తున్నాయి. అయితే ఈ క్రమంలో లోకేష్ ఎదిగాడన్న విషయాన్ని మర్చిపోతున్నాయి. ఆయనపై ఆ పాట విమర్శలని కొనసాగిస్తున్నారు.కానీ లోకేష్ పరిమితి సాధించిన విషయాన్ని గుర్తు చేసుకోలేకపోతున్నారు.ఆయన వ్యాఖ్యలు వైసీపీకి నష్టం చేకూరుస్తున్నాయని కూడా గుర్తించలేకపోతున్నారు. మొత్తానికైతే గత ఎన్నికల్లో తనకు ఎదురైన ఓటమి, అడుగడుగునా ఎదుర్కొన్న అవమానాలు అధిగమించి.. తనను తాను నిరూపించుకోవడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. ప్రజలను లోకేష్ ఎంతవరకు ఆకర్షించగలిగారు అన్నది ఎన్నికల్లో తేలనుంది.