spot_img
Homeఎంటర్టైన్మెంట్SaiPallavi : భారీ పౌరాణిక చిత్రంలో సీతగా సాయి పల్లవి... రాముడు ఎవరంటే?

SaiPallavi : భారీ పౌరాణిక చిత్రంలో సీతగా సాయి పల్లవి… రాముడు ఎవరంటే?

SaiPallavi : సాయి పల్లవి ఫ్యాన్స్ ఒకింత నిరాశలో ఉన్నారు. ఆమె కొత్త చిత్రాలకు సైన్ చేయకపోవడమే కారణం. 2022లో సాయి పల్లవి నుండి విరాటపర్వం మాత్రమే విడుదలైంది. గార్గి టైటిల్ తో మరో చిత్రం వచ్చినప్పటికీ తమిళ్ డబ్బింగ్ మూవీ కావడంతో ప్రేక్షకులు పట్టించుకోలేదు. విరాటపర్వం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కమర్షియల్ గా మాత్రం ఫెయిల్ అయ్యింది. నెలలు గడిచిపోతుండగా సాయి పల్లవి కొత్త చిత్ర ప్రకటన చేయలేదు. మరోవైపు ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పారనే ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ మరింత భయపెడుతుంది.

జార్జియా దేశంలో ఎంబిబిఎస్ పూర్తి చేసిన సాయి పల్లవి ఇకపై డాక్టర్ గా కొనసాగాలని ఆశపడుతున్నారని అందుకే సినిమాలు మానేశారనే వాదన తెరపైకి వచ్చింది. అలాగే పెళ్లి వార్తలు వినిపించాయి. ఎన్ని కథనాలు ప్రచారం అవుతున్నా సాయి పల్లవి నోరు మెదపడం లేదు. ఆమె స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అయితే సాయి పల్లవి భారీ ప్రాజెక్ట్ దక్కించుకున్నారనేది తాజా వార్త. అది కూడా బాలీవుడ్ మూవీ అట.

బాలీవుడ్ మేకర్స్ రన్బీర్ కపూర్ హీరోగా రామాయణం తెరకెక్కిస్తున్నారట. రన్బీర్ రామునిగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి సీతగా నటిస్తున్నారట. మరొక విశేషం ఏమిటంటే హృతిక్ రోషన్ రావణుడు అట. స్టార్ క్యాస్ట్ తో వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కునున్న ఈ మూవీలో సాయి పల్లవి సీత పాత్ర దక్కించుకున్నారట. కోలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుందట. సీత అంటే రాముడు, రావణాసురుడుతో కాంబినేషన్ సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి సాయి పల్లవి రన్బీర్, హృతిక్ లతో పోటీపడి నటించాల్సి ఉంది.

అదే సమయంలో సాయి పల్లవికి ఈ పాత్ర చేయడం ఒక ఛాలెంజ్ కూడా. ఈ క్రమంలో ఐకానిక్ రోల్ లో సాయి పల్లవి ఏ మేరకు రాణిస్తుందనే ఆసక్తి నెలకొంది. అదే సమయంలో సీతగా సాయి పల్లవి బెంచ్ మార్క్ సెట్ చేస్తుందని ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆదిపురుష్ మూవీలో ప్రభాస్ రాముని పాత్ర చేస్తుండగా కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. అలాగే సాయి పల్లవి కమల్ హాసన్ నిర్మాతగా శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నారని సమాచారం. ఈ రెండు ప్రాజెక్ట్స్ పై అధికారిక ప్రకటన వస్తే సాయి పల్లవిని సిల్వర్ స్క్రీన్ పై చూసి ఆనందించవచ్చు. అలాగే పుష్ప 2 లో సాయి పల్లవి నటిస్తున్నారంటూ ప్రచారం జరగడం కొసమెరుపు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేయాల్సిన సినిమాను రామ్ చరణ్ చేశాడుగా…

Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు పవన్ కళ్యాణ్... 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తర్వాత చేసిన 'గోకులంలో సీత'...

YSRCP: మారిన గిరిజనుల మనసు.. వైసీపీకి డేంజర్ బెల్!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక భయం కనిపిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో పార్టీ పుంజుకోకపోవడం పై ఆందోళన నెలకొంది. దశాబ్దాలుగా గిరిజనులు కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్ పతనమై.....

Perni Nani: పేర్ని వారి నకిలీ పట్టాలు.. ఈ కథ మామూలుగా లేదు

Perni Nani: ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక వింత వైఖరి వెలుగు చూస్తోంది. చాలామంది నేతలకు పోలీస్ కేసులు చుట్టుముడుతున్నాయి. అయితే అవన్నీ తమ వారసుల ద్వారా.. వారసుల కోసం చేసే...
Oktelugu Epaper
Exit mobile version