https://oktelugu.com/

Chiranjeevi-Srikanth Odela movie: చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న నాచురల్ బ్యూటీ…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ వాళ్లకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న ఈ స్టార్ హీరోలు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోలందరు యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసి భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : December 15, 2024 / 01:53 AM IST

    Chiranjeevi-Srikanth Odela movie

    Follow us on

    Chiranjeevi-Srikanth Odela movie:  దసర సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల…ఆ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా భారీ సక్సెస్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత మరోసారి నానితో ప్యారడైజ్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇక ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరంజీవితో ఒక భారీ పాన్ ఇండియా సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా చిరంజీవిని డైరెక్షన్ చేయాలనేది ప్రతి ఒక్కరి కల ప్రస్తుతం చిరంజీవితో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నప్పటికీ చిరంజీవి మాత్రం ఆచితూచి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు ఆయన శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు…దాంతో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం శ్రీకాంత్ ఓదెల వైపే చూస్తున్నారు.

    ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టిస్తే మాత్రం శ్రీకాంత్ ఓదెల స్టార్ట్ డైరెక్టర్ గా మారుతాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలని చూస్తున్న శ్రీకాంత్ ఓదెల మరోసారి తనను తాను స్టార్ డైరెక్టర్ గా ఎలివేట్ చేసుకునే ప్రక్రియలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది…

    ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడికి చిరంజీవితో సినిమా చేయడం ఒక మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవి ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆమె క్యారెక్టర్ కూడా సినిమా మొత్తానికి హైలైట్ లో ఉండబోతుందట. మరి చిరంజీవితో ఇంతవరకు ఆమె సినిమా అయితే చేయలేదు. ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఆ క్యారెక్టర్ కి మాత్రం సాయిపల్లవి అయితేనే బాగా సెట్ అవుతుందని దర్శకుడు అనుకుంటున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది.

    మరి దర్శకుడు అనుకున్న దానికి తగ్గట్టుగా సాయిపల్లవి కూడా ఆ క్యారెక్టర్ ను ఒప్పుకుంటే మాత్రం ఈ సినిమా మీద భారీ అంచనాలు పెరుగుతాయి. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో తనను తాను ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే మాత్రం ఆయనకి వేరే పెద్ద హీరో నుంచి అవకాశాలైతే రావనే చెప్పాలి