Bigg Boss Telugu 8 : ఈ సీజన్ టైటిల్ విన్నింగ్ రేస్ లో ఉన్న కంటెస్టెంట్ ఎవరు అని అడిగితే మన అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు నిఖిల్. సీజన్ ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఆయన హౌస్ లో తన తోటి కంటెస్టెంట్స్ తో నడుచుకున్న తీరు,టాస్కులు ఆడిన విధానం ఆడియన్స్ కి తెగ నచ్చేసింది. ఒకానొక దశలో సోషల్ మీడియా లో మొత్తం కన్నడ బ్యాచ్ వెర్సస్ తెలుగు నినాదం ఒక రేంజ్ లో నడిచింది. కర్ణాటక ప్రాంతం నుండి వచ్చిన నిఖిల్ కి ఇది బాగా ఎఫెక్ట్ అవ్వొచ్చు అనుకున్నారు. కానీ ఈ నినాదం ఆయన ఓటింగ్ శాతం ని ఇసుమంత కూడా తగ్గించలేకపోయింది. మొదటి వారం నుండి నెంబర్ 1 స్థానం లో కొనసాగుతూనే ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆయన టైటిల్ కొట్టేందుకు చాలా దగ్గర అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కి ఎంతమంది అమ్మాయిలు పడిపోయారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
విష్ణు ప్రియ, సీత, యష్మీ, సోనియా ఇలాంటి కంటెస్టెంట్స్ అందరికి నిఖిల్ అంటే చాలా ఇష్టం. యష్మీ అయితే నిఖిల్ వెంట ఏ రేంజ్ లో తిరిగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కానీ ఆయన మనసులో కావ్య ఇంకా ఉండడంతో యష్మీ కి ఓకే చెప్పలేకపోయాడు, అలా అని కచ్చితంగా నో అని కూడా చెప్పలేకపోయాడు. ఏ మనిషిని కూడా నొప్పించడం నిఖిల్ కి ఇష్టం ఉండదు, ఇది ఆయన తత్త్వం. ఈ తత్వమే అతని మీద నిందలు పడేలా చేసింది. సీత హౌస్ లోపలకు నామినేషన్స్ వేయడానికి వచ్చి నిఖిల్ ని అమ్మాయిలను నీ గేమ్ కోసం వాడుకుంటున్నావ్ అంటూ ఎలాంటి నిందలు వేసిందో తెలిసిందే. అయితే నిఖిల్ కూడా క్లారిటీ గా తన మనసులో కావ్య ఉంది అనే విషయం యష్మీ కి చెప్పుంటే ఆయన మీద ఇలాంటి నిందలు పడేవి కాదు.
ఈ విషయం యష్మీ కి 11వ వారం తెలిసింది. బయటకి వెళ్లిన తర్వాత కావ్య కాళ్ళు పట్టుకొని అయినా మళ్ళీ ఆమెతో ప్యాచప్ అవుతానని చెప్పుకొచ్చాడు. నిన్న బిగ్ బాస్ హౌస్ లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ దీపికా అడుగుపెట్టి నిఖిల్ ని తన ప్రేమ వ్యవహారం గురించి ఒక బోల్డ్ ప్రశ్న అడుగుతుంది. ఆమె మాట్లాడుతూ ‘నీ మాజీ ప్రియురాలికి ప్రస్తుతం సింగిల్ గా ఉంటుంది. ఆమె మనసులో ఇంకా నువ్వు ఉన్నావు, నీ మనసులో ఇంకా ఆమె ఉంది. కానీ మీరింకా ప్యాచప్ అవ్వలేదు. మీ ఇంట్లో నీ కోసం సంబంధాలు చూస్తున్నారు. అప్పుడు నువ్వు మీ ఇంట్లో చూసిన సంబంధం చేసుకుంటావా, లేదా నీ మాజీ ప్రియురాలి కోసం ఎదురు చూస్తావా?’ అని అడుగుతుంది. దీనికి నిఖిల్ సమాధానం ఇస్తూ ‘ఆమె మనసులో ఇంకా నేనుంటే, కచ్చితంగా ఎన్ని సంవత్సరాలైనా ఆమె కోసం ఎదురు చూస్తాను’ అని చెప్తాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.