https://oktelugu.com/

Bigg Boss 6 Telugu Adireddy : శ్రీ సత్య ని కాపాడేందుకు ఆది రెడ్డిని ఎలిమినేట్ చేసిన బిగ్ బాస్

Bigg Boss 6 Telugu Adireddy : ఈ సీజన్ లో బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ప్రతి వారం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కి.. చూసే ప్రేక్షకులకు షాకులు ఇస్తూనే ఉన్నాయి. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉండడానికి అర్హులైన ఎంతోమంది ఎలిమినేట్ కి గురవ్వడం బిగ్ బాస్ షో పై జనాల్లో తీవ్రమైన నెగెటివిటీ ని పెంచేలా చేసింది..21 మంది ఇంటి సభ్యులతో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు 7 మంది ఇంటి […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2022 / 09:23 PM IST
    Follow us on

    Bigg Boss 6 Telugu Adireddy : ఈ సీజన్ లో బిగ్ బాస్ ఎలిమినేషన్స్ ప్రతి వారం ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ కి.. చూసే ప్రేక్షకులకు షాకులు ఇస్తూనే ఉన్నాయి. టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉండడానికి అర్హులైన ఎంతోమంది ఎలిమినేట్ కి గురవ్వడం బిగ్ బాస్ షో పై జనాల్లో తీవ్రమైన నెగెటివిటీ ని పెంచేలా చేసింది..21 మంది ఇంటి సభ్యులతో ప్రారంభమైన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు 7 మంది ఇంటి సభ్యులకు చేరుకుంది.

    ఈ ఏడుగురిలో శ్రీహాన్ , రేవంత్, ఇనాయ మరియు రోహిత్ టాప్ 5 లోకి అడుగుపెట్టేసినట్టే.. ఇక చివరి 5వ స్థానం కోసం శ్రీ సత్య , ఆది రెడ్డి మరియు కీర్తి పోటీపడుతున్నారు.. వీరిలో ఎవరు టాప్ 5 లోకి వెళ్ళబోతున్నారు అనేది ఈ వీకెండ్ లో అత్యంత ఆసక్తికరమైన ఘట్టంగా నిలవబోతుంది.. ప్రస్తుతం ఉన్న ఓటింగ్ ప్రకారం.. శ్రీసత్య అందరికంటే తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లో ఉంది.

    ఇక ఆదిరెడ్డి మరియు కీర్తి కి మధ్య స్వల్ప ఓట్ల తేడా ఉంది.. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం శ్రీ సత్యని టాప్ 5 లో పంపేందుకు బిగ్ బాస్ ప్రణాళిక ప్రకారంగా వెళ్తుందని సోషల్ మీడియా లో ఒక టాక్ వినిపిస్తుంది..అందులో భాగంగానే ఆది రెడ్డిని ఈ వారం హౌస్ నుండి బయటకి పంపేయబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం..కామన్ మ్యాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన ఆది రెడ్డి 13 వారాలు కొనసాగి..14 వ వారం లోకి దిగ్విజయంగా అడుగుపెట్టాడు.. టాప్ 5 లోకి అడుగుపెడితే బాగుంటుందని అందరూ అనుకున్నారు..కానీ అతనిని ఎలిమినేట్ చేసేందుకు బిగ్ బాస్ టీం లో కుట్రలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

    అదే కనుక జరిగితే వచ్చే ఏడాది నుండి బిగ్ బాస్ సీజన్స్ ని ప్రేక్షకులు చూడడం మానేస్తారు..ఇప్పటికే అర్హత గలిగిన కంటెస్టెంట్స్ అందరిని బయటకి పంపేసి బిగ్ బాస్ షో లెక్కలేనంత నెగటివిటీ ని మూటగట్టుకుంది..ఇప్పుడు ఆదిరెడ్డి వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తే మాత్రం కచ్చితంగా ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో పై ప్రభావం పడే అవకాశాలు అయితే కచ్చితంగా ఉన్నాయి.. చూడాలిమరి ఈ వారం ఏమి జరగబోతుందో.