https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : నిఖిల్ కి దారుణమైన అన్యాయం చేసిన బిగ్ బాస్ టీం..AV వీడియోలో అసలైన సందర్భాలను ఎత్తివేత..ఇంత మోసమా!

ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేస్ లో నిఖిల్ కి బిగ్ బాస్ టీం దారుణమైన అన్యాయం చేయబోతుందా..?, ఆ టీం లో సోనియా మనుషులు ఉన్నారా?

Written By:
  • Vicky
  • , Updated On : December 14, 2024 / 07:56 AM IST

    Nikhil

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేస్ లో నిఖిల్ కి బిగ్ బాస్ టీం దారుణమైన అన్యాయం చేయబోతుందా..?, ఆ టీం లో సోనియా మనుషులు ఉన్నారా? అసలేంటి ఆ జర్నీ వీడియో అని నిన్న నిఖిల్ AV వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో మండిపడుతున్నారు. నిఖిల్ మంచితనంని చూపించకుండా, చాలా వరకు అతనికి నెగటివ్ అయ్యే విధంగానే AV వీడియో ని కట్ చేసారు. ముఖ్యంగా నిఖిల్ ఈ సీజన్ లో ఒక బ్లాక్ మార్క్ ఏమిటంటే సోనియా తో స్నేహం చేయడం. ఆమె చెప్పినట్టు నడుచుకోవడం వల్ల నిఖిల్ కి హౌస్ లో నిజమైన స్నేహితులు చాలా రోజుల వరకు దూరమయ్యారు. ఒకానొక సందర్భంలో నిఖిల్ గ్రాఫ్ ఆమె కారణంగా బాగా పడిపోయింది. అయినప్పటికీ కూడా ఆమెతో ఉన్న జర్నీ ని ప్రారంభం లో చాలాసేపు చూపించారు.

    అదే విధంగా సీత నిఖిల్ పై ఎలాంటి నిందలు వేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఒక కంటెస్టెంట్ పై ఈ రేంజ్ నిందలు రావడం మనం ఎప్పుడూ చూడలేదు. ఎదుటి మనిషి మనసుని నొప్పించడం ఇష్టం లేని మనస్తత్వం ఉన్నోడు నిఖిల్. తనని ఇష్టపడిన వాళ్లకు, అతనికి ఇష్టం లేనప్పుడు నాకు మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని ముఖం మీద చెప్పి వాళ్ళను బాధపెట్టడం ఆయనకు అసలు నచ్చదు. అదే ఆయన కొంప ముంచింది. ఆ మంచితనాన్ని సీత, యష్మీ, సోనియా లాంటోళ్ళు బయట జనాలకు తప్పుగా నిఖిల్ ని ప్రొజెక్ట్ చేసే కుట్ర చేసారు. కానీ నిఖిల్ మాత్రం వాళ్ళను బ్యాడ్ చేయడానికి చూడలేదు. ఈ కోణంలో నిఖిల్ జర్నీ వీడియో చూపించాలి, అందుకు ఆయన అర్హుడు, ఎందుకంటే బిగ్ బాస్ షోకి వచ్చి తన క్యారక్టర్ మీద నిందలు వేయించుకున్నాడు కాబట్టి.

    ఇదంతా పక్కన పెడితే నిఖిల్ మాస్టర్ మైండ్ తో ఆడిన గేమ్స్ ని కూడా ఎత్తేసాడు. ఒకవిధంగా ఓజీ క్లాన్ కి చెందిన కంటెస్టెంట్స్ 12 వ వారం వరకు కొనసాగరంటే, అది నిఖిల్ వేసిన మిస్టర్ మైండ్ వ్యూహాల వల్లే. అదంతా జర్నీ లో ఎత్తేసారు. ఇదెక్కడి న్యాయం. బిగ్ బాస్ టీం లో సోనియా ఆకుల మనుషులు ఎవరైనా ఉన్నారా?, సోనియా బయటకి వచ్చిన తర్వాత నిఖిల్ మీద ఏ రేంజ్ లో విషం కక్కుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒక విధంగా నిఖిల్ టైటిల్ మిస్ అయ్యాడంటే, అందుకు ప్రధాన కారణాలలో ఒకటి సోనియా స్నేహం అని చెప్పొచ్చు. బయట ఈమె చేస్తున్న నక్క వేషాలు తెలియక, జర్నీ వీడియో లో సోనియా ని చూపిస్తున్నప్పుడు ఆనందంతో నవ్వుకున్నాడు నిఖిల్. ఇది చూసినప్పుడు పాపం అనిపించింది. ఏది ఏమైనా నిఖిల్ జర్నీ వీడియో మాత్రం అతని అభిమానులకు తీవ్రమైన నిరాశ మిగిలించింది అనే చెప్పాలి.