https://oktelugu.com/

కరోనా వేళ మెట్రోలో కిస్సులతో జంటల లీల

కరోనా కొత్త స్ట్రెయిన్ వచ్చి మరోసారి ప్రపంచమంతా ఆగిపోతున్న టైంలో రష్యాలో కొందరు జంటలు మాత్రం ఈ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఏకంగా ముద్దులు పెట్టుకొని తమ నిరసన తెలిపారు. ఎన్నాళ్లీ కరోనా నిబంధనలు.. కట్టుబాట్లు అని మాస్కులు తీసేసి.. మెట్రో రైళ్లో ఇలా ముద్దులతో ముంచెత్తారు. తాజాగా మెట్రో రైళ్లో చాలా జంటలు ముద్దులు పెట్టుకొని కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ వెరైటీ నిరసన తెలిపారు.ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. […]

Written By:
  • NARESH
  • , Updated On : December 30, 2020 / 08:10 PM IST
    Follow us on

    కరోనా కొత్త స్ట్రెయిన్ వచ్చి మరోసారి ప్రపంచమంతా ఆగిపోతున్న టైంలో రష్యాలో కొందరు జంటలు మాత్రం ఈ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ఏకంగా ముద్దులు పెట్టుకొని తమ నిరసన తెలిపారు. ఎన్నాళ్లీ కరోనా నిబంధనలు.. కట్టుబాట్లు అని మాస్కులు తీసేసి.. మెట్రో రైళ్లో ఇలా ముద్దులతో ముంచెత్తారు.

    తాజాగా మెట్రో రైళ్లో చాలా జంటలు ముద్దులు పెట్టుకొని కరోనా వైరస్ మహమ్మారి నిబంధనలకు వ్యతిరేకంగా ఈ వెరైటీ నిరసన తెలిపారు.ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

    రష్యాలోని యెకటెరింగ్ బర్డ్ మెట్రో రైళ్లో డిసెంబర్ 24న ఇలా కొన్ని జంటలు మొత్తం మెట్రో రైళ్లో చేరి మాస్కులు, గ్లౌజులు రక్షణ సామగ్రి అంతా తీసేసి ముద్దులతో ముంచెత్తారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యింది.

    రష్యాలోనూ కొత్త కరోనా స్ట్రెయిన్ వెలుగుచూసింది. ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది. ఇప్పటికే పాత కరోనా కేసులు తగ్గక అల్లాడుతుంటే కొత్త కరోనా వ్యాపించడంపై జంటలు భగ్గుమన్నాయి. అందుకే ఇలా అన్నీ వదిలేసి ముద్దులు పెట్టుకొని తమకు పూర్వపు జీవితం కావాలంటూ నిరసన తెలిపారు.