డయాబెటిస్ రోగులు గుండెను కాపాడుకోవడం ఎలా అంటే..?

దేశంలో షుగర్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సరైన అహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామంపై ఆసక్తి చూపకపోవడం వల్ల చాలామంది మధుమేహం బారిన పడి బాధ పడుతున్నారు. అయితే డయాబెటిస్ బారిన పడిన వారు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మధుమేహ రోగుల్లో గుండె స్పందనల్లో ఊహించని మార్పులు వచ్చాయని సమాచారం. షుగర్ రోగుల్లో చాలామంది మందులు వాడితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తుంటాయి. Also Read: శరీరంలో వేడి తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..? […]

Written By: Kusuma Aggunna, Updated On : December 31, 2020 12:16 pm
Follow us on


దేశంలో షుగర్ రోగుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సరైన అహారపు అలవాట్లు లేకపోవడం, వ్యాయామంపై ఆసక్తి చూపకపోవడం వల్ల చాలామంది మధుమేహం బారిన పడి బాధ పడుతున్నారు. అయితే డయాబెటిస్ బారిన పడిన వారు ఎక్కువగా గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. మధుమేహ రోగుల్లో గుండె స్పందనల్లో ఊహించని మార్పులు వచ్చాయని సమాచారం. షుగర్ రోగుల్లో చాలామంది మందులు వాడితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తుంటాయి.

Also Read: శరీరంలో వేడి తగ్గాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..?

అయితే షుగర్ లెవెల్స్ అదుపులోకి వచ్చిన తరువాత కొంతమంది మందులు వాడడం ఆపేస్తున్నారు. అయితే షుగర్ రోగులు మందులు వినియోగించడం వల్ల అదుపులోకి వచ్చిన షుగర్ మళ్లీ మందులు వాడేయడం ఆపేస్తే మళ్లీ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. షుగర్ వల్ల గుండెలో రక్త శాతం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా ధమనుల్లో రక్తం గడ్డ కట్టడంతో పాటు గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.

Also Read: ఈ స్మార్ట్ బ్యాండ్ తో అనారోగ్య సమస్యలకు చెక్.. ఎలా అంటే..?

శాస్త్రవేత్తలు అమెరికాకు చెందిన ఒక వైద్య కళాశాలకు చెందిన రోగులపై పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. మధుమేహం బారిన పడిన ప్రతి పది మందిలో ఇద్దరు గుండెజబ్బుతో బాధ పడుతున్నారు. మధుమేహంతో షుగర్ తో బాధ పడుతుంటే గుండె కండరాలు బలహీనపడకుండా మందులు తీసుకుంటే మంచిది. షుగర్ తో బాధ పడేవారు పొగ త్రాగడం, మద్యపానానికి దూరంగా ఉంటే మంచిది.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

షుగర్ తో బాధ పడేవాళ్లు కంటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కాటరాక్ట్‌, గ్లుకోమా, డయాబెటిక్‌ రెటినోపతి, డయాబెటిక్‌ మాక్యులర్‌ ఎడెమా లాంటి సమస్యల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మధుమేహం నరాలను కూడా దెబ్బ తీస్తుంది. పాదానికి గాయమైనా, నొప్పి కలిగినా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది.