బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త కరోనా దేశానికి వచ్చేసింది. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన 20 మందికి కొత్త కరోనా సోకింది. వారు ఎంతమందిని కలిశారు.? ఎంత మందికి వ్యాపింపచేశారో తెలియదు. ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న భారత్ కు ఇప్పుడు బలమైన కొత్త కరోనా స్ట్రెయిన్ మరింత భయపెడుతోంది. పాత దానికంటే పవర్ ఫుల్ గా మారిన ఈ వైరస్ తో ప్రాణాలకే ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే కేంద్రం అప్రమత్తమైంది. వెంటనే రంగంలోకి దిగింది. జనవరి 31వరకు అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర పౌర విమానయాన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బ్రిటన్ లో వెలుగుచూసిన అక్కడ వేగంగా విస్తరిస్తూ లక్షలమందికి సోకుతూ వందల్లో ప్రాణాలు తీస్తోంది. కరోనా వ్యాక్సిన్ ను కూడా తట్టుకునేలా రూపాంతరం చెందిన మనుషుల ప్రాణాలు తీస్తోంది. శీతాకాలం కావడంతో మరింత బలంగా తయారై కబళిస్తోంది.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ రాకపోకలు ఉంటే విదేశీయులు, ప్రవాస భారతీయుల ద్వారా ఆ వైరస్ దేశంలోకి వచ్చి మళ్లీ మన దేశంలో కేసులు పెరిగే ప్రమాదం ఉంది. 135 కోట్ల భారత్ లో అది వేగంగా వ్యాపిస్తే ప్రమాదం. ఇప్పటికే బ్రిటన్ నుంచి వచ్చిన వారిలో కొత్త వైరస్ వెలుగుచూసింది. అందుకే తాజాగా కేంద్రం అలెర్ట్ అయ్యింది. మొదట బ్రిటన్ దేశానికి రాకపోకలు బంద్ చేసిన బీజేపీ ప్రభుత్వం తాజాగా జనవరి 31 వరకు అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తూ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.