https://oktelugu.com/

శివుని దర్శించుకునే సమయంలో పాటించాల్సిన నియమాలు.!

సాధారణంగా మనం శివాలయాలను సందర్శించి నప్పుడు ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మొక్కుతాము. ఈ విధంగా నందీశ్వరుని దర్శనం చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కనిపిస్తుంది. ఎందుకంటే నంది ఆ పరమశివుడికి ద్వారక పాలకుడు. నందీశ్వరుని అనుగ్రహం లేనిదే కైలాస పర్వతంలోకి ఎవరికీ అనుమతి ఉండదు. అందువల్ల నందీశ్వరునికి అంతటి ప్రాముఖ్యత కల్పిస్తారు. శివాలయానికి వెళ్లిన భక్తులు ముందుగా ఆ నందీశ్వరుని దర్శించుకోవాలి. లింగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 18, 2021 / 11:23 AM IST
    Follow us on

    సాధారణంగా మనం శివాలయాలను సందర్శించి నప్పుడు ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా శివలింగానికి ఎదురుగా ఉన్న నందీశ్వరుని మొక్కుతాము. ఈ విధంగా నందీశ్వరుని దర్శనం చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కనిపిస్తుంది. ఎందుకంటే నంది ఆ పరమశివుడికి ద్వారక పాలకుడు. నందీశ్వరుని అనుగ్రహం లేనిదే కైలాస పర్వతంలోకి ఎవరికీ అనుమతి ఉండదు. అందువల్ల నందీశ్వరునికి అంతటి ప్రాముఖ్యత కల్పిస్తారు.

    శివాలయానికి వెళ్లిన భక్తులు ముందుగా ఆ నందీశ్వరుని దర్శించుకోవాలి. లింగ రూపంలో ఉన్న శివుని మనసు అను గ్రహించాలంటే మన మనసును స్వామివారిపై కేంద్రీకృతం చేసి నమస్కరించాలి. అదేవిధంగా నందీశ్వరుని పృష్ట భాగాన్ని నిమురుతూ, శృంగాల మధ్య నుంచి స్వామివారిని దర్శించుకోవడం వల్ల నంది అవ్వ గుడి విందా అనుగ్రహం కలిగి మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి.

    శివాలయంలో ఉన్న నందీశ్వరుని చెవిలో మనం ఏవైనా కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుతాయని భావిస్తారు. మన కుడి చేతితో నందీశ్వరుడి చెవికి అడ్డుగా పెట్టి మెల్లగా మన గోత్రం, మన మనసులో ఉన్న కోరికను చెప్పి నమస్కరించడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయి. నందీశ్వరుడిని దర్శించిన తర్వాత ఆలయంలో ఉన్న శివునికి పూజించాలి. శివుడి దగ్గర నుంచి పువ్వులను ఇస్తే తీసుకెళ్ళి నందీశ్వరునికి సమర్పించాలి. శివ పురాణం ప్రకారం నందీశ్వరుని కొమ్ముల మధ్య నుంచి ఆ పరమశివుని దర్శించుకున్న వారికి కైలాస ప్రాప్తి కలుగుతుందని శివపురాణంలో తెలియజేయడమైనది. ఈ విధంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మహా శివుని నమస్కరించడం ద్వారా ఆ పరమేశ్వరుని అనుగ్రహం మనపై కలిగే అనుకున్న పనులు నెరవేరుతాయి.