https://oktelugu.com/

పవన్ -చరణ్ లతో శంకర్ సినిమా.. ఇండస్ట్రీ షేకే !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తర్వాత ప్రకటించిన చిత్రాల గురించి వస్తోన్న వార్తల్లో.. తాజాగా వినిపిస్తోన్న క్రేజీ రూమర్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పవన్ – చరణ్ కలయికలో ఒక సినిమా రాబోతుందని. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఒకవేళ నిజమైతే మాత్రం ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం, పైగా తమిళ ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ వార్త నిజం అవాలని కోరుకుందాం. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : January 18, 2021 / 11:33 AM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ తర్వాత ప్రకటించిన చిత్రాల గురించి వస్తోన్న వార్తల్లో.. తాజాగా వినిపిస్తోన్న క్రేజీ రూమర్.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పవన్ – చరణ్ కలయికలో ఒక సినిమా రాబోతుందని. ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు గానీ, ఒకవేళ నిజమైతే మాత్రం ఇండస్ట్రీ షేక్ అవ్వడం ఖాయం, పైగా తమిళ ఇండస్ట్రీ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరి ఈ వార్త నిజం అవాలని కోరుకుందాం.

    Also Read: విప్పడంలో పీక్స్ చూపిస్తోన్నా ఆఫర్లు లేవట !

    ఇక రాజకీయాలు మాత్రమే చేస్తానని సినిమాలు చేయనని ప్రకటించి.. చివరకు మళ్ళీ అభిమానుల కోసం సినిమాలు చేస్తున్నాడు పవర్ స్టార్. అందుకే ఆయన కోసమే కథలు రాసుకుని ఎప్పటికైనా ఆయనతో సినిమా చెయ్యాలని ఎదురు చూస్తున్న ఎందరో దర్శకనిర్మాతలు మొత్తానికి మళ్ళీ పవన్ డేట్స్ కోసం తిరుగుతున్నారు. పవన్ ప్రస్తుతం చేస్తోన్న సినిమాలు కాకుండా.. ఆయన తరువాత సినిమాల లిస్ట్ ఇలా ఉంది.

    Also Read: పెళ్లయ్యాక ఫిట్ నెస్ మర్చిపోయిన హీరోయిన్ !

    హరిశంకర్, క్రిష్, సురేందర్ రెడ్డి, రామ్ తాళ్లూరి, సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఐదు సినిమాలు కమిట్ అయ్యారు పవన్. ‘వకీల్ సాబ్ ‘ మూవీ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ మూవీ స్టార్ట్ అవుతుందని అన్నారు. అలానే సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో మలయాళం మూవీ “అయ్యప్పనుమ్ కోశియుమ్” రీమేక్ ఆ తరువాత మొదలుకానుంది. ఆ తరువాత దర్శకుడు సురేందర్ రెడ్డితో ఒక చిత్రం ఉంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్