తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన రాజకీయాల్లో అపర చాణక్యుడు. ఎంతలా అంటే.. రాజకీయాలను తన వైపు తిప్పుకోవాలన్నా.. ప్రతిపక్షాలను కట్టడి చేయాలన్నా అది ఆయనకే సాధ్యం. అయితే.. ఇప్పుడు ఒక కొత్త వివాదం వినిపిస్తోంది. అది రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం కాదు.. కేసీఆర్ కుటుంబంలోనే. అదికూడా ఆయన కొడుకు కూతుళ్ల మధ్యనే అంట. దీని కారణంగానే కేటీఆర్‌కు పట్టాభిషేకం ఆలస్యం జరుగుతోందని టాక్. అనూహ్యంగా కవితను ముఖ్యమంత్రి చేయాలన్న వాదనలు కేసీఆర్ ఇంట్లో తెరపైకి వచ్చినట్లుగా సమాచారం.
Also Read: తెలుగు రాష్ట్రాలను వదలని కేంద్రం.. మళ్లీ ఏం చేసిందంటే?
గతంలోనూ చాలామంది రాజకీయ నాయకులు తమ వారసులను సరైన రీతిలో ప్రమోట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఎన్టీఆర్ తన కుటుంబం నుండి సరైన రీతిలో వారసులను ప్రమోట్ చేయలేకపోయారు. ఇక సోనియా గాంధీ కుటుంబంలో రాహుల్ గాంధీ పరిస్థితీ అంతే. అయితే.. ఈ ఫెయిల్యూర్స్‌ను గమనించిన కేసీఆర్.. ఆ పొరపాటు తాను చేయకూడదన్న ఉద్దేశంతో మొదటి నుండి కూడా కేటీఆర్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. తాను అనుకున్న ఫెడరల్ ఫ్రంట్ వ్యూహం ఫలించి ఉంటే ఇప్పటికే కేటీఆర్ ఎప్పుడో సీఎం అయ్యే వారు. కానీ అది కాస్త దెబ్బతీసింది. ఇక అప్పటి నుండి ఈనెల కేటీఆర్ సీఎం అవుతారు.. వచ్చే నెలా అవుతారంటూ లీకులు వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా కేటీఆర్ వర్సెస్ కవిత కోల్డ్ వార్ జరుగుతోందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Also Read: గ్రేటర్ లొల్లి మళ్లీ మొదలైనట్టే.. మేయర్ ఎవరికి.?
ఇటీవలికాలంలో కవితను ముఖ్యమంత్రిని చేయాలని కేసీఆర్‌పై వివిధ వర్గాల నుండి ఒత్తిడి మొదలైందట. ముఖ్యంగా పండితుల మీద, జాతకాల మీద విపరీతమైన నమ్మకం ఉన్న కేసీఆర్‌తో, కొందరు పండితులు జాతక రీత్యా కేటీఆర్ అంటే కవితకి రాజ్యాధికారం ఇస్తే పార్టీ మనుగడ గొప్పగా ఉంటుందని సూచించినట్లు సమాచారం. ఈ కారణంగానే.. కేటీఆర్‌కు పట్టాభిషేకం చేయాలన్న కేసీఆర్ ఆలోచన ఎప్పటికప్పుడు వాయిదా పడుతోందని సమాచారం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
పార్టీలో ఇప్పటికే కవిత కంటే కేటీఆర్ పట్ల ఎక్కువ సానుకూలత ఉన్న సంగతి తెలిసిందే. కానీ.. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ఈ చర్చల్లో ఎంత వరకు వాస్తవం ఉందనేది మాత్రం టాస్క్. నిజంగా కేసీఆర్ కుటుంబంలో కోల్డ్ వార్ జరుగుతోందా, లేక టీఆర్ఎస్ పార్టీలో అయోమయం సృష్టించడానికి విపక్షాలు ఈ ప్రచారాన్ని తెరపైకి తెచ్చాయా అనేది కూడా తెలియకుండా ఉంది. మొత్తానికి కేటీఆర్ సీఎం కావడానికి మరికొన్ని ఆగాల్సిందేనేమో.