https://oktelugu.com/

Revanth Reddy : కొడంగల్ లో రేవంత్ గెలవడు.. కాంగ్రెస్ కు 20 సీట్లు కూడా రావు

Revanth Reddy : అధికారంలో ఉన్నప్పుడు.. అధికారంలో ఉన్నవారు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు మాట్లాడే మాటలు ఒక విధంగా ఉంటాయి. అదే అధికారంలో ఉన్నవారితో గ్యాప్ ఏర్పడితే మాట్లాడే మాటలు కూడా వేరే విధంగా ఉంటాయి.

Written By: , Updated On : March 27, 2025 / 04:55 PM IST
Revanth Reddy

Revanth Reddy

Follow us on

Revanth Reddy : తెలంగాణలో ప్రశ్నించే గొంతుకగా తనను తాను అభివర్ణించుకున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్.. గడిచిన ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి పోటీ చేసి గెలిచారు. సమీప భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేష్ రెడ్డి పై విజయం సాధించారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తీన్మార్ మల్లన్న మంత్రి పదవిని ఆశించినట్టు తెలుస్తోంది. కానీ ఆయన ఆశించినట్టుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మంత్రి పదవి ఇవ్వలేదు. దీంతో తీన్మార్ మల్లన్న అధిష్టానం పై ఆసహనం వ్యక్తం చేశారు. అధికార పార్టీలో ఉంటూ.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రభుత్వం నిర్వహించిన కుల గణనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.. బీసీలకు అన్యాయం జరిగిందని.. బీసీల లెక్కని తేల్చే ప్రయత్నం సరిగ్గా జరగలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గంలో చివరి ముఖ్యమంత్రి అవుతారని.. రెడ్డి సామాజిక వర్గాన్ని ఇష్టానుసారంగా తిట్టారు తీన్మార్ మల్లన్న. దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న పై సస్పెన్షన్ వేటు విధించింది.

Also Read : ఒకే వేదికపై రేవంత్, కేటీఆర్.. ఈ విషయంలో ఏకమయ్యారు

రూటు మార్చారు

భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకగా ఆ పార్టీపై తీవ్రస్థాయిలో మండిపడేవారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసేవారు. తను చేసిన వ్యాఖ్యల ఫలితంగా అప్పట్లో తీన్మార్ మల్లన్న కేసులు కూడా ఎదుర్కొన్నారు. రెండు సందర్భాల్లో జైలుకు కూడా వెళ్లి వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో గ్యాప్ ఏర్పడిన నేపథ్యంలో తీన్మార్ మల్లన్న మళ్లీ ప్రశ్నించే గొంతుకగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇటీవల అసెంబ్లీ లాబీలో కేటీఆర్, హరీష్ రావు ని కలిసి.. తమ చేస్తున్న బీసీ ఉద్యమానికి అండగా నిలవాలని కోరారు. దానికి వారిద్దరు సుముఖత వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న తీన్మార్ మల్లన్న.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 20 సీట్లు కూడా రావాలి.. కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గెలవలేడని జోస్యం చెప్పారు. ” కాంగ్రెస్ పార్టీ ఏదో అనుకుంటుందని.. ఇష్టానుసారంగా అప్పులు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కూడా గెలుస్తామని భావిస్తోంది. కానీ అదంతా సులభం కాదు. వచ్చే ఎన్నికల్లో 20 సీట్లు కూడా రావు.. అక్కడిదాకా ఎందుకు కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే గెలవడని” తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మంత్రి పదవి రాలేదని తీన్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఒకవేళ మంత్రి పదవి గనుక ఇచ్చి ఉంటే ఇలా మాట్లాడే వారు అంటూ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తులను సస్పెండ్ చేయడమే సరైన నిర్ణయం అని వారు వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read : మనల్ని ఎవడూ నమ్మడం లేదు.. మార్కెట్లో అప్పులు పుట్టడం లేదు..