https://oktelugu.com/

Venkatesh and Harish Shankar : హరీష్ శంకర్ తో వెంకటేష్..మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటి!

Venkatesh and Harish Shankar : టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకరు హరీష్ శంకర్(Harish Shankar). కానీ ఇతనికి ఉన్న టాలెంట్ కి తగ్గ గుర్తింపు రాలేదని విశ్లేషకులు సైతం చెప్తుంటారు.

Written By: , Updated On : March 27, 2025 / 04:46 PM IST
Venkatesh , Harish Shankar

Venkatesh , Harish Shankar

Follow us on

Venkatesh and Harish Shankar : టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకరు హరీష్ శంకర్(Harish Shankar). కానీ ఇతనికి ఉన్న టాలెంట్ కి తగ్గ గుర్తింపు రాలేదని విశ్లేషకులు సైతం చెప్తుంటారు. ‘గబ్బర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ ఎక్కడికో వెళ్ళిపోతాడు, స్టార్ డైరెక్టర్స్ లీగ్ లో మొదటి వరుసలో ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ‘రామయ్య వస్తావయ్యా’ చిత్రం చేసి పెద్ద ఫ్లాప్ ని అందుకున్నాడు. దీంతో హరీష్ శంకర్ గ్రాఫ్ బాగా డౌన్ అయ్యింది. మళ్ళీ ఆయన సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ అనే చిత్రం చేశాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. హరీష్ శంకర్ కి ఒక విధంగా కం బ్యాక్ లాంటి మూవీ అనుకోవచ్చు.

Also Read : వెంకటేష్ తో సినిమా సెట్ చేసుకుంటున్న సీనియర్ డైరెక్టర్…

కానీ ఈ చిత్రం తర్వాత ఆయన చేసిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం యావరేజ్ గా ఆడింది. ఆ తర్వాత ఆయన వరుణ్ తేజ్ తో కలిసి ‘గద్దలకొండ గణేష్’ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ అయ్యింది, కానీ ఈ సినిమా తర్వాత ఆయన దాదాపుగా 5 ఏళ్ళు విరామం తీసుకొని ‘మిస్టర్ బచ్చన్’ చిత్రం తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. ఇంత లాంగ్ గ్యాప్ రావడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagath Singh) మూవీ ని ప్రకటించడం వల్లే. ఈ సినిమా పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) పొలిటికల్ బిజీ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పటికీ ఈ చిత్రం ట్రాక్ లోనే ఉంది కానీ, మళ్ళీ ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేదానిపై క్లారిటీ లేదు.

అందుకే హరీష్ శంకర్ తన సమయాన్ని ఇంకా వృధా చేసుకోవాలి అనే ఆలోచనలో లేడు. ఇతర హీరోలతో సినిమాలు చేసుకునే పనిలో పడ్డాడు, ఇప్పటికే బాలయ్య(Nandamuri Balakrishna) కి ఒక స్టోరీ ని వినిపించాడు, ఆయనకు బాగా నచ్చింది, త్వరలోనే చేద్దామని అన్నాడు, అదే విధంగా రీసెంట్ గానే విక్టరీ వెంకటేష్ కి కూడా ఒక స్టోరీ ని వినిపించాడట. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తర్వాత దాదాపుగా 60 స్టోరీలను రిజెక్ట్ చేసిన వెంకటేష్(Victory Venkatesh) కి, హరీష్ శంకర్ వినిపించిన స్టోరీ విచ్చలవిడిగా నచ్చేసిందట. షెడ్యూల్స్ ప్లాన్ చెయ్యి, డేట్స్ ఇస్తాను అని చెప్పాడట. రాబోయే రెండు మూడు నెలల్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ‘హరి హర వీరమల్లు’, ‘ఓజీ’ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు పూర్తి అయ్యేలోపు సెప్టెంబర్ నెల కూడా వచ్చేస్తుంది. అందుకే ఈ గ్యాప్ లో హరీష్ శంకర్ వెంకటేష్ తో సినిమాని ప్లాన్ చేశాడు.

Also Read : పవన్ కళ్యాణ్ దెబ్బకు హరీష్ శంకర్ పరిస్థితి ఇలా అయ్యిందా..? అవకాశాలు లేక చివరికి అలాంటి పనులు!