https://oktelugu.com/

CM Revanth Reddy : మనల్ని ఎవడూ నమ్మడం లేదు.. మార్కెట్లో అప్పులు పుట్టడం లేదు..

CM Revanth Reddy :  హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..

Written By: , Updated On : March 21, 2025 / 10:05 AM IST
CM Revanth Reddy

CM Revanth Reddy

Follow us on

CM Revanth Reddy :  హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..” ముఖ్యమంత్రి అయినప్పటి కంటే జెడ్పిటిసిగా గెలిచినప్పుడే నేను సంతోషపడ్డాను. కారుణ్య నియామకాలను గత ప్రభుత్వం చేపట్టలేదు. 10 సంవత్సరాలుగా ఈ నియామకాలు చేపట్టకుండా నాటి పాలకులు నిర్లక్ష్యం వహించారు. కారుణ్య నియామకాలు అనేవి ప్రజల హక్కు. జాబ్ క్యాలెండర్ తో పాటు కారుణ్య నియామకాలు కూడా ఇవ్వాల్సిందే. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు ముఖ్యపాత్ర పోషించారు. నిరుద్యోగుల బాధలను గుర్తించడం కాబట్టే ఏడాదిలో 59 వేల ఉద్యోగాలను భర్తీ చేసాం. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు లభిస్తాయని చాలామంది అనుకున్నారు. కానీ గత పది సంవత్సరాలలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు.. గత ప్రభుత్వం ఒక్క పరీక్ష కూడా సజావుగా నిర్వహించలేదు. ఒక నియామకం కూడా సక్రమంగా చేపట్టలేదు. ఉద్యోగం సాధించిన వారి కుటుంబ సభ్యుల సమక్షంలో నియామక పత్రాలు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. 10 నెలల్లో మేము చేసిన పనులను 10 సంవత్సరాలలో గులాబీ పార్టీ నాయకులు ఎందుకు చేయలేదు. నోటిఫికేషన్లు మొత్తం మేము ఇచ్చామని గులాబీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. అలాంటప్పుడు ఒక్క పోస్ట్ కూడా ఎందుకు భర్తీ చేయలేదు.. గులాబీ పార్టీ అధినేత కుటుంబంలో సభ్యులను ప్రజలు తిరస్కరిస్తే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇది తెలంగాణ ప్రజలు సాధించిన ఘన విజయమని” రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Also Read : అర్హులకే రూ.4 లక్షలు.. ఎవరికి ఇస్తామో వెల్లడించిన సీఎం రేవంత్‌రెడ్డి!

ఉద్యోగులవి 8000 కోట్ల పెండింగ్ బిల్లులు..

నియామక పత్రాలు అందజేయడానికి అంటే ముందు ముఖ్యమంత్రి ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు..” ప్రభుత్వ శాఖల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా చెల్లించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. బయట మనల్ని ఎవడూ నమ్మడం లేదు. అప్పు అడిగితే పుట్టడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. గత ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు సక్రమంగా చెల్లించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చి ఉండేది కాదు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించడానికి ఇటీవల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సుముఖత వ్యక్తం చేశారు. భవిష్యత్తు కాలంలో ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు ఉండకుండా చూస్తామని హామీ ఇచ్చారు.. ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రభుత్వం మీద అవన్నీ గుదిబండగా మారాయి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ వస్తున్నాం.. ఇన్ని ప్రతిబంధకాలు ఎదుర్కొంటూ హుందాగా మాట్లాడాలి అంటే ఎలా? ముఖ్యమంత్రి అయ్యాడు.. రేవంత్ రెడ్డి హుందాగా ఉండాలి. హుందా భాషను మాట్లాడాలి అంటున్నారు. నేను హుందా గానే ఉంటున్నాను.. కానీ ఎదుటి వ్యక్తి కూడా హుందాగానే ఉండాలి కదా అంటూ” రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తంగా ఇటీవల తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కొలువుల పండుగ సభ ద్వారా రేవంత్ రెడ్డి స్పష్టమైన జవాబులు ఇచ్చారు.

Also Read : రెండోసారీ నేనే ముఖ్యమంత్రి… రేవంత్ రెడ్డిలో అంత కాన్ఫిడెన్స్ ఏంటి?