Revanth Reddy : తెలంగాణ(Telangana) రాష్ట్రంలో భద్రాచలం(bhadrachalam) ప్రాంతంలో సీతారాముల కళ్యాణం(Sri Rama Navami) గొప్పగా జరుగుతుంది. రామదాసు(ramadasu) కట్టించిన ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణం పురాతన కాలం నుంచే ఘనంగా జరుగుతున్నట్టు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుత కాలంలో ఇక్కడ జరిగే సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం పట్టువస్త్రాలు సమర్పిస్తూ ఉంటుంది. ముత్యాల తలంబ్రాలు కూడా సీతారాములకు కానుకలుగా ఇస్తుంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి(Telangana state chief minister Revanth Reddy) సీతారాములవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సీతారాముల కళ్యాణ వేడుకను పురస్కరించుకొని శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీసమేతంగా భద్రాచలం(bhadrachalam) చేరుకొనున్నారు. సాయంత్రం భద్రాచలంలోనే బస చేసి.. ఆదివారం జరిగే కళ్యాణ వేడుకలో పాల్గొంటారు. ముఖ్యమంత్రి తో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు భట్టి విక్రమార్క(Bhatti vikramarka), పొంగులేటి శ్రీనివాసరెడ్డి(ponguleti Srinivas Reddy), తుమ్మల నాగేశ్వరరావు(Tum mala Nageswara Rao), కొండా సురేఖ(konda Surekha), ధనసరి సీతక్క(dhanasari seetakka) కూడా సీతారాముల కళ్యాణ వేడుకల్లో పాల్గొంటారు.
Also Read : సీఎం రేవంత్ రెడ్డి పై యాంకర్ అనసూయ ఫైర్..ఇంత అన్యాయమా అంటూ కామెంట్స్!
మధ్యాహ్నం అక్కడే భోజనం
సీతారాముల కల్యాణాన్ని పురస్కరించుకొని భద్రాచలం వెళ్లే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. భద్రాచలం ప్రాంతంలో పర్యటిస్తారు. ముంపు మండలాలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తారని తెలుస్తోంది. పోలవరం(polavaram project) నిర్మాణంలో భాగంగా తెలంగాణలోని కొన్ని మండలాలు ఆంధ్రా లోకి వెళ్లిపోయాయి. అప్పటినుంచి ఆ మండలాల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే ఆ మండలాల ప్రజల సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆదివారం సన్న బియ్యం లబ్ధిదారుడి ఇంట్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) భోజనం చేస్తారని తెలుస్తోంది. అయితే ఆ సన్నబియ్యం లబ్ధిదారుడి పేరును.. అతని వివరాలను బయటకు చెప్పడానికి అధికారులు ఇష్టపడటం లేదు.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వివరాలు బయటకు వెళ్లడం లేదని తెలుస్తోంది. భద్రాచలం చుట్టుపక్కల ప్రాంతాలు మావోయిస్టులకు పట్టు ఉన్నవి. పైగా ఇటీవల కాలంలో ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను.. ముఖ్యమంత్రి మధ్యాహ్నం భోజనం చేసే లబ్ధిదారుడి వివరాలను అధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. సున్నితమైన ప్రాంతం కావడం.. ముఖ్యమంత్రి పర్యటిస్తున్న నేపథ్యంలో.. పోలీసులు భద్రాచలాన్ని(bhadrachalam) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఓసారి భద్రతకు సంబంధించి మాక్ ట్రయల్ కూడా నిర్వహించారు. పైగా భక్తులకు ఎప్పటికప్పుడు సేవలు అందించడానికి.. ప్రత్యేకంగా అధికారుల బృందాన్ని భద్రాద్రి, ఖమ్మం జిల్లాల కలెక్టర్లు ఏర్పాటు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ, ఖమ్మం సిపి కూడా అక్కడే ఉండి విధులు నిర్వహిస్తున్నారు. వివిధ శాఖల సిబ్బంది కూడా విధుల్లో పాల్గొంటున్నారు.
Also Read : రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!