Homeటాప్ స్టోరీస్Telangana Speaker Clean Chit Defected MLAs: తెలంగాణ ఫిరాయింపుల తీర్పు.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

Telangana Speaker Clean Chit Defected MLAs: తెలంగాణ ఫిరాయింపుల తీర్పు.. ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

Telangana Speaker Clean Chit Defected MLAs: తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అద్భుతమైన ‘మేజిక్ షో’. చూసే కళ్లకు ఒకలా కనిపిస్తుంది, కానీ స్పీకర్ గారు చెప్పే లోపు అది పూర్తిగా వేరేలా మారిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కండువాలు కప్పుకుని, ఆ పార్టీ కోసం ప్రచారాలు చేసి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసినా.. వారు ‘పార్టీ మారలేదని’ స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే, పదిమంది […]

Telangana Speaker Clean Chit Defected MLAs: తెలంగాణ రాజకీయాల్లో ఇదొక అద్భుతమైన ‘మేజిక్ షో’. చూసే కళ్లకు ఒకలా కనిపిస్తుంది, కానీ స్పీకర్ గారు చెప్పే లోపు అది పూర్తిగా వేరేలా మారిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ కండువాలు కప్పుకుని, ఆ పార్టీ కోసం ప్రచారాలు చేసి, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేసినా.. వారు ‘పార్టీ మారలేదని’ స్పీకర్ గారు క్లీన్ చిట్ ఇచ్చేశారు. అంటే, పదిమంది ఎమ్మెల్యేలు వేసుకున్న కాంగ్రెస్ కండువాలు నిజమైనవి కావు, అవన్నీ కేవలం ‘కలర్ థెరపీ’ కోసమే అన్నమాట!

Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!

స్పీకర్ గారి ‘అద్భుత’ లాజిక్!

సాధారణ మనుషులమైతే “ఒక పార్టీలో గెలిచి, మరో పార్టీలో చేరడం ఫిరాయింపు” అంటాం. కానీ స్పీకర్ గారి డిక్షనరీలో డెఫినిషన్లు వేరే ఉంటాయి. వీరు పార్టీ మారలేదట, బహుశా తమ సొంత పార్టీ (బీఆర్ఎస్) పట్ల ఉన్న విపరీతమైన ప్రేమతో.. కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసి, కాంగ్రెస్ కోసం ప్రచారం చేశారేమో! ఇది ఒక రకమైన ‘పరోపకార కీర్తన’ కావచ్చు. ఎమ్మెల్యేలు తమకు నచ్చిన పార్టీలో ఉండొచ్చు కానీ, పార్టీ మారకూడదు. మరి వారు కాంగ్రెస్ వేదికలపై ఎలా కనిపించారంటే… “అది కేవలం ఒక గెటప్” అని సరిపెట్టుకోవాలి.

దానం నాగేందర్ గారి ‘యూ టర్న్’ మలుపులు!

ఈ షోలో మన దానం నాగేందర్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకరోజు “నేను కాంగ్రెస్‌లోనే ఉన్నా” అంటారు, మరుసటి రోజు “నేను బీఆర్ఎస్‌లోనే ఉన్నా” అని బాంబు పేలుస్తారు. ఒక వ్యక్తి ఒకే సమయంలో రెండు పార్టీల్లో ఉండటం అనేది కేవలం అసాధారణమైన రాజకీయ తెలివితేటలు మాత్రమే కాదు, ఇది ఒక సైంటిఫిక్ అద్భుతం కూడా! ఆ పదిమంది ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటే, కేవలం పార్టీ గుర్తు మాత్రమే మారినట్టుంది. బహుశా బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచిన వారు, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ‘అప్‌డేట్’ అయిపోయారేమో!

న్యాయం.. దారి తప్పిందా?

బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు దాకా వెళ్లి పోరాటం చేసినా, చివరకు స్పీకర్ గారు వేసిన ఒకే ఒక ‘క్లీన్ చిట్’ పంచ్‌తో మొత్తం కథ సుఖాంతమైంది. “మీరు ఆధారాలు చూపించలేదు” అని స్పీకర్ అంటే, “కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా, ఈయన చూడలేకపోతున్నారేంటి?” అని బీఆర్ఎస్ వాళ్లు తల బాదుకుంటున్నారు.

చివరికి తేలిందేమిటంటే.. రాజ్యాంగం, నిబంధనలు అన్నీ ఒక ఎత్తు, స్పీకర్ గారి ‘క్లీన్ చిట్’ ఒక ఎత్తు. రేపు ఏదైనా వింత జరిగితే, రాత్రికి రాత్రి పార్టీలు మారినా.. ఉదయానికల్లా “మేము మారలేదు, అదే పార్టీలో ఉన్నాం” అని స్పీకర్ దగ్గరకు వెళ్లి సర్టిఫికేట్ తీసుకుంటే చాలు. తెలంగాణ రాజకీయం అంటేనే మాయాబజార్ అని మరోసారి నిరూపితమైంది!

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper