బడ్జెట్ సమావేశాల్లో..
గత వారం అసెంబ్లీ బడ్జెట్(Asembly Budjet meetings) సమావేశాల్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ‘రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు‘ అని ప్రకటించారు. ‘బీఆర్‌ఎస్ నేతలు ఉప ఎన్నికలు వస్తాయని ఊదరగొడుతున్నారు, కానీ అవి ఎట్టిపరిస్థితుల్లోనూ రావు. గతంలో బీఆర్‌ఎస్ హయాంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి? రాజ్యాంగం, స్పీకర్(Speaker) వ్యవస్థ అప్పటిలాగే ఉన్నాయి‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సుప్రీంకోర్టు విచారణలో ఉన్న ఫిరాయింపు కేసును సూచిస్తూ, దాని అధికారాన్ని తేలిగ్గా తీసుకున్నట్లుగా భావించబడ్డాయి.
బాధ్యత ఉండాలి కదా..
సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలను రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా చూసింది. బీఆర్‌ఎస్(BRS)నుంచి కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరుతూ బీఆర్‌ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలు కోర్టు ఆగ్రహానికి కారణమయ్యాయి. ‘చట్టసభలో చేసే ప్రకటనలు బాధ్యతాయుతంగా ఉండాలి‘ అని జస్టిస్ గవాయ్ హితవు పలికారు. ఈ వివాదం రాజకీయంగా, చట్టపరంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది, రేవంత్ రెడ్డి తదుపరి చర్యలపై దృష్టి నెలకొంది.
Also Read : ఆ భూములు ప్రభుత్వానివా? HCU కు చెందినవా?