Homeఎంటర్టైన్మెంట్Anchor Anasuya and CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై యాంకర్...

Anchor Anasuya and CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి పై యాంకర్ అనసూయ ఫైర్..ఇంత అన్యాయమా అంటూ కామెంట్స్!

Anchor Anasuya and CM Revanth Reddy : దేశవ్యాప్తంగా ఇప్పుడు హైదరాబాద్ HCU పరిధిలో ఉన్నటువంటి 400 ఎకరాలలో విస్తరించిన అడవిని నేలమట్టం చేయడం పై తీవ్రమైన నిరసన జ్వాలలు రగులుతున్న సంగతి అందరికి తెలిసిందే. రాత్రికి రాత్రి JCB లు వచ్చి చెట్లను కూల్చేస్తుంటే, అడవి లో నివాసం ఉంటున్న జింకలు, నెమలి లు ఎటు పోవాలో తెలియక ఆర్తనాదాలు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.. ఆ వీడియోలను టాలీవుడ్ లో ఉన్న ప్రతీ టాప్ సెలబ్రిటీ ఇన్ స్టాగ్రామ్ లోని తమ స్టోరీస్ లో షేర్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికీ మానవత్వం లేని చర్య అని మండిపడుతున్నారు. ఇప్పటికే కల్కి డైరెక్టర్ నాగ అశ్విన్(Naga Ashwin) వంటి వారు నేరుగా మీడియా ముందే ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా విమర్శించాడు. ఇక ఇన్ స్టాగ్రామ్ లో అయితే రేణు దేశాయ్(Renu Desai), సమంత(Samantha Ruth Prabhu), శ్రీలీల(Sreeleela), రష్మిక(Rashmika Mandanna), ఉపాసన కొణిదెల(Upasana Konidela), సుష్మిత కొణిదెల ఇలా అందరూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Also Read : న్యూ ఇయర్ పార్టీలో తాగేసి గంతులేసిన యాంకర్ అనసూయ..వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇప్పుడు ఈ జాబితాలోకి యాంకర్ అనసూయ(Anasuya Bharadwaj) కూడా వచ్చి చేరింది. జింకలు, నెమలి లు, మరియు ఇతర వన్య ప్రాణులు అడవి ని నేలమట్టం చేసిన తర్వాత ఎటు వెళ్లాలో తెలియక, రోడ్ల మీకు వచ్చిన కొన్ని వీడియోస్ ని షేర్ చేస్తూ ఆమె కంటతడి పెట్టుకుంది. HCU లో జరిగిన ఈ సంఘటన నా హృదయాన్ని ముక్కలు చేసింది, ఇది కచ్చితంగా భరించలేనిది, ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో అప్లోడ్ చేసింది. సమాజం లో జరిగే పలు సంఘటనలు తనకు అనిపిస్తే నిర్మొహమాటంగా స్పందిస్తూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అలవాటు ఉన్న అనసూయ, ఇలా కామెంట్స్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే కొంతమందికి మాత్త్రం ఇలా సెలబ్రిటీలు వరుసగా స్పందించడం పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో, దేశంలో జరిగే ఎన్నో ముఖ్యమైన దుర్ఘటనల్లో మౌనం పాటించే సెలబ్రిటీలు, అకస్మాత్తుగా ఇలా ఎవరో ఆదేశాలు జారీ చేసినట్టు అందరూ ఒకేసారి నిరసన వ్యక్తం చేస్తున్నారేంటి?, అంటే ప్రతిపక్ష పార్టీ నేత కేటీఆర్ కి టాలీవుడ్ సెలబ్రిటీలందరూ తెలుసు కాబట్టి, వాళ్ళ చేత ఈయనే ఇలా పెట్టిస్తున్నాడా?, లేకపోతే నిజంగానే సెలబ్రిటీలందరూ ఈ అంశంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారా అనేది అర్థం కావడం లేదని కాంగ్రెస్ మద్దతుదారులు ఇన్ స్టాగ్రామ్ లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు మిడిమిడి జ్ఞానంతో భవిష్యత్తులో జరగబోతున్న అభివృద్ధి పై వ్యతిరేకత చూపిస్తున్నారు?, గతంలో అల్లు అర్జున్ విషయం లో కూడా ఇలాగే స్పందించారు, అసలు ఈ సెలబ్రిటీలకు ఏమి అవుతుంది అంటూ నిలదీస్తున్నారు. ఈ అంశం ఇంకా ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

Also Read : రేవంత్‌పై వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. ధిక్కారంగా పరిగణిస్తామని హెచ్చరిక!

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
RELATED ARTICLES

Most Popular