
Chinese Spy Balloon: ఇటీవల చైనా అమెరికా గగనతలం మీద నిఘా బెలూన్లు ఎగరేసింది. జపాన్ మీదుగా దీనిని పంపించింది. అయితే మొదట్లో దీనిని స్కైలాబ్‌గా అనుకున్న అమెరికా.. తర్వాత అది కదులుతున్న తీరు చూసి అనుమానం వ్యక్తం చేసింది. తర్వాత దానిని కూల్చేసింది. అయితే అప్పట్లో దీనిపై చైనా బుకాయించింది. తర్వాత తనదే అని ఒప్పుకుంది. ఈక్రమంలో అసలు ఆ బెలూన్‌లో ఏం పెట్టింది? ఎందుకు ఎగరేస్తోంది అనే వివరాలను పెంటగాన్ రక్షణ కార్యాలయం ఆరా తీసింది. అయితే ఆ బెలూన్‌లో కెమెరాలు ఏర్పాటు చేసినట్టు గుర్తించింది. ఆ కెమెరాల్లో వివిధ దేశాల్లో సున్నిత ప్రాంతాలను ఫొటోలు, వీడియో తీసి వాటిని నేరుగా బీజింగ్ లోని చైనా రక్షణ కార్యాలయానికి చేరువేరుస్తున్నట్టుగా గుర్తించింది. అయి తే దీనిని చైనా తోసిపుచ్చింది.
చైనా బెలూన్ పేల్చివేస్తున్నప్పుడు అమెరికా కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పుడు వాటిని భారత్‌కు ఇచ్చింది. ప్రస్తుతం చైనా తైవాన్ వద్ద యుద్ధ విన్యాసాలు చేస్తున్న సమయంలో అమెరికా వాటిని భారత్‌కు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా భారత్, అమెరికా వాయు సేన దళాలు ఎక్స్‌కోప్ ఇండియా-23 పేరుతో విన్యాసాలు చేస్తున్నాయి. ఈ విన్యాసాలు పశ్చిమబెంగాల్‌లోని పానాగఢ్, కలాయ్‌కుండా ఉత్తరప్రదే శ్‌లోని ఆగ్రా సమీపంలో ఇరు దేశాలకు చెందిన వాయు సేన బృందాలు విన్యాసాలు చేస్తున్నాయి. చరిత్రలో తొలిసారిగా అమెరికాకు చెందిన బీ-1 లాన్సర్ రకానికి చెందిన రెండు బాంబర్లు ఈ విన్యాసాల్లో పాల్గొనన్నాయి. ఇవి ఏప్రిల్ 13న భారత్ భూభాగంలోకి అడుగు పెట్టనున్నాయి. ఇప్పటికే అమెరికా వాయుసేనకు చెందిన్ ఎఫ్-15 ఫైటర్ జెట్‌లు, సీ-17, సీ-130జే విమనాలు భారత్‌కు చేరుకోనున్నాయి. అయితే ఈ విన్యాసాలు ఇరు దేశాల మధ్య సమన్వయం పెంచుతాయని అమెరికా జనరల్ కెన్నెత్ చెబుతున్నారు. భారత్, అమెరికా మఽధయ బలపడిన సైనిక సహకారాన్ని ఇవి సూచిస్తున్నాయని ఆయన వివరించారు.

అయితే డిసెంబర్‌లో భారత్ అండమాన్ దీవుల సమీపంలో త్రివిధ దశాలు యుద్ధ విన్యాసాలు చేశాయి. అప్పుడు కూడా ఒక నిఘా బెలూన్ సంచరిస్తున్నట్టు కొనుగొన్నాయి. అప్పుడు దాన్ని కూడా పేల్చివేశాయి. ప్రస్తుతం యుద్ధ విన్యాసాలు జరుగుతున్న సమయంలో అమెరికా, పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్ భాష్, భారత్ వాయుసేన చీఫ్ వీఆర్ చౌద్రి చైనా ఎయిర్ బెలూన్‌కు సంబంధించి పలు కీలకమైన విషయాలను పంచుకున్నారు. ‘ఆ సమయంలో మా భూ భాగంపై కి చైనా బెలూన్ వచ్చింది. దాని కదలికలు మాకు అనుమానాస్పదంగా కన్పించడంతో పేల్చేశాం. అందులో కొన్ని కెమెరాల ఆనవాళ్లు కన్పించాయి. అయితే అందులో మనుషులు ఉంటే మాత్రం సజీవంగా పట్టుకుని విచారించేవాళ్లమని’ అమెరికా, పసిఫిక్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ కెన్నిత్ విల్స్ భాష్ భారత్ వాయుసేన చీఫ్ వీఆర్ చౌద్రితో పేర్కొన్నారు. అయితే ఆ బెలూన్‌ను కూల్చేసిన తర్వాత తాము సేకరించిన ఆధారాలను చౌద్రితో పంచుకున్నారు. ఇరు దేశాల వాయువిన్యాసాలు జరుగుతున్న నేపథ్యంలో చైనా బెలూన్ విషయాలను పంచుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ ఆధారాలతో భారత్ ఏం చేస్తుందనేది చర్చనీయాంశ మైంది.