
Mahesh-Trivikram Movie: టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా ముందు వరుసలో ఉంతుంది. గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా అంత పెద్ద హిట్ ఏమి కాదు, అయిన కూడా ఆడియన్స్ ఎందుకు ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అంతలా ఎదురు చూస్తున్నారంటే ఆ రెండు సినిమాలు నేటి తరం ఆడియన్స్ కి టీవీ టెలికాస్ట్ అప్పుడు బాగా నచ్చింది కాబట్టే.
అందులోనూ మహేష్ బాబు వరుస సూపర్ హిట్స్ తో మంచి జోష్ మీద ఉన్నాడు.అలాగే త్రివిక్రమ్ కూడా ‘అలా వైకుంఠపురం లో’ వంటి ఇండస్ట్రీ హిట్ కొట్టి పీక్ ఫామ్ లో ఉన్నాడు. అలాంటి సమయం లో వీళ్లిద్దరి నుండి వస్తన్న సినిమా కావడం తో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ప్రారంభం అయిపోయింది.

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తారీఖున ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టు ఇదివరకే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.నోట్లో సిగరెట్ పట్టుకొని మహేష్ బాబు స్టైల్ గా నడిచి వస్తున్న ఫోటో ని అప్లోడ్ చేస్తూ ఈ విషయాన్నీ తెలియచేసారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా కథకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
అదేమిటి అంటే ఈ చిత్రం లో మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని. తండ్రి కొడుకు పాత్రలలో ఆయన కనిపిస్తాడని, కథ కాస్త నందమూరి బాలకృష్ణ రీసెంట్ హిట్ ‘వీర సింహా రెడ్డి’ తో పోలి ఉంటుందని ఫిలిం నగర్ లో ఒక టాక్ వినిపిస్తుంది. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలంటే కనీసం టీజర్ వచ్చే వరకు అయిన ఆగాల్సిందే.