
Pooja Hegde: పూజా కొత్త చిత్రం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో పూజా పాల్గొంటున్నారు. తమిళ్ హిట్ మూవీ వీరం రీమేక్ గా ఈ కిసీ కా భాయ్ కిసీ జాన్ తెరకెక్కింది. గతంలో సౌత్ రీమేక్స్ తో సల్మాన్ సంచలనాలు చేశారు. పోకిరి, బాడీ గార్డ్, కిక్ చిత్రాలను సల్మాన్ రీమేక్ చేశారు. అవి ఆయనకు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఈ మూవీలో పూజా హెగ్డే వెంకటేష్ చెల్లెలు పాత్ర చేయడం విశేషం.
పూజా తెలుగు ఫ్యామిలీ కి చెందిన అమ్మాయిగా కనిపించనున్నారు. ఆమె కొన్ని తెలుగు డైలాగ్స్ చెప్పారు. రంజాన్ కానుకగా ఏప్రిల్ 21న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ చిత్రం విడుదల కానుంది. గత ఏడాది పూజాకు అసలు కలిసి రాలేదు. ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. రాధే శ్యామ్ తో మొదలైన పరాజయాల పరంపర కొనసాగింది.

రాధే శ్యామ్, ఆచార్య టాలీవుడ్ ఆల్ టైం డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి. హీరో విజయ్ కి జంటగా నటించిన బీస్ట్ సైతం నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో బీస్ట్ ప్లాప్ కాగా… తమిళంలో పర్లేదు అనిపించుకుంది. ఇక రణ్వీర్ సింగ్ కి జంటగా నటించిన సర్కస్ మరో డిజాస్టర్. ఈ మధ్య కాలంలో ఇంత చెత్త సినిమా రాలేదని బాలీవుడ్ ప్రేక్షకులు తేల్చారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చిన పూజాకు వరుస ప్లాప్స్ పడ్డాయి.
ఎఫ్ 3తో కూడా కలుపుకుంటే పూజా హెగ్డే 2022లో ఐదు ప్లాప్స్ ఇచ్చినట్లు. కాబట్టి 2023 ఆమెకు చాలా కీలకం. సల్మాన్, మహేష్ చిత్రాలతో ఆమె హిట్స్ కొట్టాలి. లేదంటే కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే. పూజా మరోసారి త్రివిక్రమ్ ని నమ్ముకుంది. చెప్పాలంటే ఆమెను స్టార్ ని చేసింది త్రివిక్రమే. ఐటెం సాంగ్స్ రేంజ్ కి పడిపోయిన పూజా హెగ్డేకు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ ఇచ్చాడు.

అరవింద సమేత వీరరాఘవ మూవీతో ఆమెను హిట్ ట్రాక్ ఎక్కించాడు. ఆ మూవీ తర్వాత ఆమెకు వరుస హిట్స్ పడ్డాయి. అల వైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వరుసగా మూడో చిత్రానికి ఆమెను రిపీట్ చేస్తున్నారు. కాగా పూజా హెగ్డే లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎల్లో ట్రెండీ వేర్ ధరించి బోల్డ్నెస్ కి తెరలేపింది. పూజా ఫోటోలు చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు. పూజా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.