పాపం.. ఈ కాకి ఏం తప్పు చేసింది? తెల్లగా పుట్టడమే దీని తప్ప?

సాధారణంగా కాకి ఏ రంగులో ఉంటుందని ఎవరినైనా ప్రశ్నిస్తే నల్ల రంగులోనే ఉంటుందని ఎవరైనా చెబుతారు. ఎవరైనా కొంచెం నల్లగా ఉంటే కాకి నలుపు అని హేళన చేస్తూ ఉంటారు. అయితే ఈ కాకుల్లో కొన్ని కాకులు తెలుపు రంగులో కూడా ఉంటాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన దేశంలోని పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడూ తెల్ల కాకులు దర్శనం ఇస్తూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో వందలాది నల్ల కాకుల […]

Written By: Kusuma Aggunna, Updated On : August 15, 2020 1:13 pm
Follow us on

సాధారణంగా కాకి ఏ రంగులో ఉంటుందని ఎవరినైనా ప్రశ్నిస్తే నల్ల రంగులోనే ఉంటుందని ఎవరైనా చెబుతారు. ఎవరైనా కొంచెం నల్లగా ఉంటే కాకి నలుపు అని హేళన చేస్తూ ఉంటారు. అయితే ఈ కాకుల్లో కొన్ని కాకులు తెలుపు రంగులో కూడా ఉంటాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మన దేశంలోని పలు ప్రాంతాల్లో అప్పుడప్పుడూ తెల్ల కాకులు దర్శనం ఇస్తూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో వందలాది నల్ల కాకుల మధ్యలో ఉన్న తెల్ల కాకి వీడియో తెగ వైరల్ అయింది.

Also Read: వెనక్కి వెళ్తున్న జలపాతం.. వీడియో వైరల్!

ఆ తెల్ల కాకిని చూసిన వాళ్లు గతంలో తెల్ల కాకి ఉందని విన్నామని కానీ నమ్మలేదని చూస్తే నమ్మాల్సి వస్తోందని సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా ఒడిశాలో సైతం ఒక తెల్లకాకి ఆకాశ వీధుల్లో విహరించింది. ఒడిశాలోని జార్సుగూడ పట్టణంలో కావ్ కావ్ అని అరుస్తూ తెల్ల కాకి సందడి చేసింది. అయితే ఢిల్లీ వాసుల్లా కాకుండా జార్సుగూడ వాసులు కాకికి చుక్కలు చూపించారు.

Also Read: రైతుల సరికొత్త ఆలోచన.. రేగు పండ్లతో బీర్.. భారీ లాభాలు!

ఎంతో శ్రమించి అరుదైన తెల్ల కాకిని బోనులో బంధించారు. బోనులో ఉన్న కాకికి జనాలు ముప్పుతిప్పలు పెట్టారు. బోనులో తెల్ల కాకి ఉందని సమీప గ్రామాల్లో సైతం జోరుగా ప్రచారం జరిగింది. దీంతో జనాలు గుంపులుగుంపులుగా గుమికూడి ఆ కాకిని చూడటానికి వచ్చారు. పదుల సంఖ్యలో జనం గుమికూడటంతో కాకి కావ్ కావ్ అంటూ కేకలు పెట్టింది. విషయం తెలిసిన అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కాకిని బంధించిన స్థానికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జంతు హక్కుల సంఘాలు కాకిని బంధించటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తెల్లగా పుట్టడమే ఆ కాకి చేసిన నేరమా…? అని ప్రశ్నిస్తున్నాయి.