మీకు తెలుసా? ఈ చీరతో కరోనా అంతం!

మన దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నియంత్రించే మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. వైద్యులు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకే అవకాశాలు తక్కువ చేసుకోవాలన్నా, కరోనా బారిన పడకుండా చూసుకోవాలన్నా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మాత్రమే మార్గమని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఏకంగా రోగ నిరోధక శక్తిని పెంచే చీరలు అందుబాటులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌ […]

Written By: Kusuma Aggunna, Updated On : August 15, 2020 12:51 pm
Follow us on

మన దేశంలో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారిని పూర్తి స్థాయిలో నియంత్రించే మందులు, వ్యాక్సిన్లు అందుబాటులోకి రాలేదు. వైద్యులు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా సోకే అవకాశాలు తక్కువ చేసుకోవాలన్నా, కరోనా బారిన పడకుండా చూసుకోవాలన్నా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మాత్రమే మార్గమని చెబుతున్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు మార్కెట్లో అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం ఏకంగా రోగ నిరోధక శక్తిని పెంచే చీరలు అందుబాటులోకి వచ్చాయి. మధ్యప్రదేశ్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ హ్యాండిక్రాఫ్ట్‌ కార్పొరేషన్‌ “ఆయుర్ వస్త్రా” పేరుతో ఈ చీరలను అందుబాటులోకి తెచ్చింది. అధికారులు రకరకాల సుగంధ ద్రవ్యాలతో ఈ చీరలను తయారు చేయించామని… ఇవి ధరిస్తే రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు వైరస్ సోకే అవకాశాలు తగ్గుతాయని చెబుతున్నారు.

ప్రస్తుతం రోగ నిరోధక శక్తిని పెంచే చీరలు తయారు చేయించామని… ఇమ్యూనిటీ పెంచే ఇతర దుస్తులను త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ చీరను ధరించిన వారికి కరోనా సోకదని అధికారులు తేల్చి చెబుతున్నారు. భోపాల్‌కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్‌ మాలేవర్‌ సర్కార్ ఆదేశాల మేరకు ఈ చీరను తయారు చేశాడు. ఇమ్యూనిటీ పెంచే ఈ చీరల తయారీకీ ఎంతో నైపుణ్యం అవసరమని… చీర తయారీ కోసం ఎక్కువ సమయం పడుతుంద్ని మాలేవర్ చెప్పారు.

నల్ల మిరియాలు, రాయల్‌ జీలకర్ర, బే ఆకు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, లవంగాలతో ఈ చీరను తయారు చేశామని అన్నారు. సుగంధ ద్రవ్యాలను పొడి చేసి నీటిలో నానబెట్టి ఆని ఆవిరిని చీర, మాస్క్ లేదా ఇతర దుస్తులకు పట్టిస్తారని… ఒక చీర తయారీకి ఆరు రోజుల సమయం పడుతుందని… రెండు నెలల పాటు శ్రమించి ఈ పద్ధతిని కనిపెట్టామని… ఈ పద్దతి వందల సంవత్సరాల నాటికి చెందిందని మాలేవర్ అన్నారు. ఈ చీర ఖరీదు కేవలం 3 వేల రూపాయలు కావడం గమనార్హం.