https://oktelugu.com/

బిత్తిరి సత్తికి కరోనా.. ఆందోళన లో ఫ్యాన్స్

తెలుగు న్యూస్ మీడియాలో ‘బిత్తిరి సత్తి’ ఒక సంచలనం. “అసలు ఇలాంటి హావభావాలతో ఎవరైనా న్యూస్ చెప్తారా?” అనే రేంజ్ నుంచి.. “ఇలాంటి వాళ్ళు మాకు ఎందుకు దొరకడం లేదు..?” అని ఇతర ఛానెళ్ళు మదనపడే వరకు చేవెళ్ల రవి కుమార్ అలియాస్ బిత్తిరి సత్తి కెరీర్ కొనసాగుతూనే ఉంది. అయితే తన కెరీర్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సత్తికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ చికిత్స తీసుకున్నాడు. […]

Written By: , Updated On : August 15, 2020 / 01:20 PM IST
Follow us on

Bittiri Satti Attacked In Front Of V6 Office

తెలుగు న్యూస్ మీడియాలో ‘బిత్తిరి సత్తి’ ఒక సంచలనం. “అసలు ఇలాంటి హావభావాలతో ఎవరైనా న్యూస్ చెప్తారా?” అనే రేంజ్ నుంచి.. “ఇలాంటి వాళ్ళు మాకు ఎందుకు దొరకడం లేదు..?” అని ఇతర ఛానెళ్ళు మదనపడే వరకు చేవెళ్ల రవి కుమార్ అలియాస్ బిత్తిరి సత్తి కెరీర్ కొనసాగుతూనే ఉంది. అయితే తన కెరీర్ లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సత్తికి కరోనా వైరస్ సోకింది. ఇప్పుడు ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లోనే ఉంటూ చికిత్స తీసుకున్నాడు.

Also Read: పూజా హెగ్డే డబుల్ రోల్ అట !

తాజాగా టీవీ9 నుండి బయటకు వచ్చి ‘సాక్షి’ ఛానల్ లో చేరాడు సత్తి. ‘గరం గరం వార్తలు’ వార్తలు అనే కార్యక్రమాన్ని అక్కడ ప్రవేశపెట్టగా ఒక్కసారిగా సాక్షి ఛానల్ టీఆర్పీలలో ఈ కార్యక్రమం అగ్రస్థానాన్ని సాధించింది. మొదటి నాలుగు స్థానాల్లో కూడా ఇదే కార్యక్రమం నిలవడం గమనార్హం. ఇలా ఒక వైపు ప్రోగ్రాం కి మంచి ఫాలోయింగ్ వస్తూ ఉంటే సత్తికి కరోనా సోకడం నిజంగా వారికి చాలా పెద్ద దెబ్బ.

Also Read: ఎన్టీఆర్ మీద ప్రేమే.. చరణ్ కి మైనస్ !

ఇక బిత్తిరి సత్తికి కరోనా సోకడంతో మొత్తం అతని టీం అంతా హోమ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయింది. తన కార్యక్రమంతో దిల్ ఖుష్ దివ్య (టిక్ టాక్ దివ్య), వార్తల వాణి అనే ఇద్దరమ్మాయిల పరిచయం చేశాడు సత్తి. ఇప్పుడు వాళ్లు కూడా క్వారంటైన్ లో ఉన్నారు. అయితే గరంగరం వార్తలను ఎంతో ఉత్సాహంగా మొదలుపెట్టిన టీం సాక్షికి ఇప్పుడు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరి ‘గరంగరం వార్తలు’ ప్రోగ్రాం ను సత్తి లేకుండా కొనసాగిస్తారేమో వేచి చూడాలి. అయితే రెండు రాష్ట్రాల్లో సత్తి అంటే ఇష్టపడే వాళ్ళు అంతా కొద్దిగా ఆందోళన చెందుతున్నా.. అతనికి ఎటువంటి ప్రమాదం లేదని రిపోర్టులు వచ్చాయి.