డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొద్దిరోజులుగా పూరీ మ్యూజింగ్స్ పేరుతో సమాజంలోని సమస్యలపై మాట్లాడుతున్నారు. తనదైన శైలిలో ఆ సమస్యలపై విశ్లేషిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలోనే ఆయన విశ్లేషణలపై పలు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. పలువురు పూరికి మద్దతుగా మాట్లాడుతుండగా మరికొందరు వ్యతిరేకంగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటారు.
Also Read: తెలుగు బ్యూటీకి క్రేజీ ఛాన్స్ లు.. రవితేజతో కూడా !
తాజాగా పూరి జగన్మాథ్ ‘ఫర్ ఫెక్ట్ భర్త’ అనే టాపిక్ పై తనదైన శైలిలో విశ్లేషించారు. పెళ్లాయిన ఆడవాళ్లందరికీ విన్నపం చేస్తూ.. జీవితం సుఖమయం కావాలంటే ఎలా ఉండాలో ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. దీంతో ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
జీవితంలో ఫర్‌ఫెక్ట్ తండ్రి.. ఫర్‌ఫెక్ట్ తల్లి.. ఫర్‌ఫెక్ట్ డ్రైవర్.. పర్‌ఫెక్ట్ నర్సు ఉంటారేమోగానీ ఫర్‌ఫెక్ట్ భర్త ఎక్కడ ఉండడని పూరి తేల్చిచెప్పాడు. ఫర్‌ఫెక్ట్ భర్త అనే కాన్సప్టే ఒక భ్రమ అని స్పష్టం చేశాడు. తన మొగుడకి ఇలాంటి క్వాలిటీస్.. క్యారెక్టరే ఉండాలని భార్య పెద్ద లిస్ట్ రాసుకుంటే ప్రాబ్లమ్స్‌లో పడిపోతారని తెలిపాడు. మొగుడిని అంచనా వేయడం కష్టమని.. అందుకే పెళ్ళైన ప్రతీ ఆడది ఏదో ఒక సమయంలో కన్నీళ్ళు పెట్టక తప్పదన్నాడు.
జీవితంలో మిమ్మల్ని చాలామంది చాలాసార్లు ఏడిపిస్తారని.. అయితే ఎక్కువగా ఏడిపించేది మాత్రం ఒక్క మొగుడే అన్నారు. ఎందుకంటే మీ పక్కనే ఉంటాడు.. పక్కలోనే ఉంటాడు.. చెప్పకుండా కొన్ని చేస్తాడు.. చెప్పి కొన్ని చేస్తాడు.. సీక్రెట్‌గా మరెన్నో చేస్తాడు.. అందుకే మీకు కాలుద్ది.. తప్పు లేదు.. కానీ అవే తప్పులు మీనాన్న చేస్తే మీరు క్షమిస్తారు కదా? అలాగే మొగుడిని కూడా క్షమించండి..
Also Read: ఆంటీలందరికీ ఏమైంది… మళ్ళీ రెచ్చిపోయిన అపూర్వ ఆంటీ !
జీవితంలో ఆమాత్రం ఏడుపులు మొగుడు లేకపోయిన కూడా ఉంటాయని పూరి గుర్తు చేశారు. ఇక్కడ పర్‌ఫెక్ట్ భర్త కాని ఫర్‌ఫెక్ట్ భార్య కాని ఎవరు ఉండరన్నారు. పెళ్లంటేనే అడ్జెస్ట్‌మెంట్ ఆఫ్ ఇండియా అంటూ పూరి తనదైన శైలిలో విశ్లేషించాడు. ఇకనైనా భార్యలు ఫర్‌ఫెక్ట్ మొగుడు కాన్సెప్ట్ నుంచి బయటపడుతారో లేదో వేచి చూడాల్సిందే..!