https://oktelugu.com/

సీఎం, గవర్నర్ డిష్యూం.. డిష్యూం

ఓ వైపు ఉప్పు.. మరో వైపు నిప్పు.. రెండు ఎదురు పడితే చిటపటే.. ఇప్పుడు మహారాష్ట్రలోనూ గవర్నర్, సీఎం మధ్య మాటల తూటాలు పేలాయి. రాజ్యాంగ పరంగా గౌరవంగా ఉండాల్సిన గవర్నర్.. సీఎంకే కౌంటర్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ ప్రోద్బలంతో ఇరికించేలా చేయడంతో సీఎం కూడా ఘాటుగా సమాధానమిచ్చాడు. దీంతో గవర్నర్ వర్సెస్ సీఎం మధ్యన మాటల యుద్ధం నడిచింది. Also Read: భారత్ కరోనా తగ్గుముఖం.. మరో మూడునెలల్లో జీరో కానుందా? మహారాష్ట్ర గవర్నర్ భగత్ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 / 06:54 PM IST
    Follow us on

    ఓ వైపు ఉప్పు.. మరో వైపు నిప్పు.. రెండు ఎదురు పడితే చిటపటే.. ఇప్పుడు మహారాష్ట్రలోనూ గవర్నర్, సీఎం మధ్య మాటల తూటాలు పేలాయి. రాజ్యాంగ పరంగా గౌరవంగా ఉండాల్సిన గవర్నర్.. సీఎంకే కౌంటర్ ఇవ్వడం.. కేంద్రంలోని బీజేపీ ప్రోద్బలంతో ఇరికించేలా చేయడంతో సీఎం కూడా ఘాటుగా సమాధానమిచ్చాడు. దీంతో గవర్నర్ వర్సెస్ సీఎం మధ్యన మాటల యుద్ధం నడిచింది.

    Also Read: భారత్ కరోనా తగ్గుముఖం.. మరో మూడునెలల్లో జీరో కానుందా?

    మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆ రాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే మధ్య మాటల తూటాలు పేలాయి.. ఆలయాలు, ఇతర ప్రార్థన ఆలయాలను తెరిచే అంశంపై వాడీ వేడిగా మాటలు సంధించుకున్నారు. లేఖలు.. ప్రత్యుత్తరాలతో సెగ పుట్టించారు. ‘సీఎం ఠాక్రేజీ ఒక్కసారిగా లౌకికవాదిగా మారిపోయారా?’ అని ప్రార్థన ఆలయాలు తెరవడంపై గవర్నర్ వ్యంగ్యంగా లేఖ రాయడం దుమారం రేపింది. దానికి కౌంటర్ గా.. ‘నాకెవరు హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ సీఎం ఉద్దవ్ ఠాక్రే ఘాటుగా సమాధానమివ్వడం మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది.

    కరోనా కారణంగా దేశంలో ఆలయాలు, ప్రార్థన ఆలయాలు ఏడాది మార్చి నుంచి మూసివేశారు. ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగైన కారణంగా మహారాష్ట్రలో తెరవాలని గవర్నర్ కోశ్యారీ సీఎం ఉద్దవ్ కు సోమవారం లేఖ రాశారు. ఈ సందర్భంగా సీఎం ఉద్దవ్ పై గవర్నర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘బలమైన హిందుత్వ వాది మహారాష్ట్రలో ప్రార్థన మందిరాలను ఇంకా తెరవకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందని.. బార్లు, రెస్టారెంట్లు, బీచ్ లను తెరిచారు.దేవుళ్లను లాక్ డౌన్ లో ఉంచారు.. మీరే లౌకికవాదిగా మారారా?’ అంటూ గవర్నర్ లేఖలో ప్రశ్నించారు.

    Also Read: నంబర్ 1 చానెల్ నుంచి వైదొలిగిన ప్రముఖ జర్నలిస్టు? కారణమేంటి?

    ఇందుకు సీఎం ఉద్దవ్ ఘాటుగా సమాధానమిచ్చారు. ‘నాకెవరు హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెరిస్తే హిందుత్వవాది.. తెరవకపోతే లౌకికవాదా? భగవంతుడి నుంచి ఆదేశాలు మీకు వస్తాయోమో నాకు కాదు ’ అంటూ ప్రత్యుత్తరం రాసి కౌంటర్ ఇచ్చారు. ప్రజల మతవిశ్వాసాల కంటే తనకు వారి ప్రాణాలు రక్షించడమే ముఖ్యం అని.. లాక్ డౌన్ ఎత్తివేయడం సరైందని కాదని ఠాక్రే తెలిపారు.