https://oktelugu.com/

భారత్ కరోనా తగ్గుముఖం.. మరో మూడునెలల్లో జీరో కానుందా?

కరోనా పేరు చెబితేనే ప్రపంచం భయాందోళన చెందుతోంది. చిన్న..పెద్ద.. పేద..ధనిక అనే తేడా లేకుండా కరోనా మహమ్మరి అందరిపై తన ప్రభావం చూపుతోంది. చైనాలో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. Also Read: కరోనా మృతులకు రూ.5 లక్షలు.. జగన్‌ వరం.. కేసీఆర్ కరుణించవా? కొన్నినెలలపాటు భారత్ లో లాక్డౌన్ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనాపై ప్రజలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2020 6:50 pm
    Follow us on

    కరోనా పేరు చెబితేనే ప్రపంచం భయాందోళన చెందుతోంది. చిన్న..పెద్ద.. పేద..ధనిక అనే తేడా లేకుండా కరోనా మహమ్మరి అందరిపై తన ప్రభావం చూపుతోంది. చైనాలో సోకిన కరోనా వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు పాకింది. భారత్ లోనూ కరోనా ఎంట్రీ ఇవ్వడంతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే.

    Also Read: కరోనా మృతులకు రూ.5 లక్షలు.. జగన్‌ వరం.. కేసీఆర్ కరుణించవా?

    కొన్నినెలలపాటు భారత్ లో లాక్డౌన్ కొనసాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాయి. దీంతో ప్రజలంతా ముఖానికి మాస్కులు ధరించడం.. శానిటైజర్లు వాడటం.. భౌతిక దూరం పాటించడం వంటి వాటిని అలవాటు చేసుకున్నారు. అయితే లాక్డౌన్లోనూ భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరిగాయి.

    ఇటీవల కేంద్రం అన్ లాక్ చేస్తున్న సమయంలో భారత్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఒక్కరోజే దేశంలో కొత్త 54వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ‌త రెండున్న‌ర నెల‌ల్లో ఇంత త‌క్కువ స్థాయిలో రోజువారీ కేసుల సంఖ్య న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. జూలై ఆఖ‌రి వారంలో ఇండియాలో చివ‌రిసారిగా 50వేల స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి.

    ఆగస్టు నుంచి క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది. ప్రస్తుతం మళ్లీ ఆ కేసుల సంఖ్య రోజు తగ్గుతున్నట్లు కన్పిస్తోంది. సెప్టెంబర్ నెలఖరు వరకు ఇదే కొనసాగింది. ఇక సెప్టెంబర్ మూడో వారం నుంచి క్రమంగా పాజిటివ్ కేసుల సంఖ్య కంటే రికవరీ సంఖ్య పెరుగుతున్నాయి. ప్ర‌స్తుతం ఆ సంఖ్య తొమ్మిది ల‌క్ష‌ల్లోపుకు చేరింది.

    Also Read: చంద్రబాబుకు షాకిచ్చిన జగన్ సర్కార్.. ఇంటిని ఖాళీ చేయాల్సిందే!

    ఇది ఇలానే కొనసాగితే భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య మరో మూడునెలల్లో జీరోక చేరుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే శీతాకాలంలో కరోనా వైరస్ భారత్ లో విజృంభించే అవకాశం ఉందనే పలువురు హెచ్చరిస్తున్నారు. ఇది నిజంకానీ పక్షంలో భారత్ లో మరో మూడునెలల్లో కరోనా కేసులు జీరోకు చేరడం ఖాయమనే వాదనలు విన్పిస్తున్నారు. వైరాలజిస్టులు సైతం మానవులపై వైరస్ ప్రభావం కొద్దిరోజులే ఉంటుందని చెబుతుండటం గమనార్హం.