Pooja Hegde: ఇటీవల పూజా హెగ్డే ఇంట్లో వేడుక చోటు చేసుకుంది. ఆమె బ్రదర్ వివాహం చేసుకున్నారు. ఈ శుభవార్తను పూజా హెగ్డే అభిమానులతో పంచుకున్నారు. అన్నయ్య పెళ్లిలో పూజా సందడి చేశారు. వదినమ్మకు స్వాగతం అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. అలాగే బ్రదర్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. దీంతో పూజా బ్రదర్ కి ఆమె ఫ్యాన్స్ బెస్ట్ విషెస్ తెలియజేశారు. తాజాగా చోళీ లెహంగా ధరించిన పూజా గ్లామరస్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అవి సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలట. బ్రదర్ సంగీత్ వేడుక కోసం ఇలా అందంగా సిద్ధమయ్యానని పూజా చెప్పకనే చెప్పారు.

ఇక బ్రదర్ పెళ్లి ముగిసిన నేపథ్యంలో మీ వివాహం ఎప్పుడని అభిమానులు అడుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. కన్నడ అమ్మాయి అయిన పూజా హెగ్డే పుట్టి పెరిగింది మాత్రం ముంబైలో. అక్కడే మోడలింగ్ స్టార్ట్ చేసి నటిగా మారారు. 2012లో ముగమూడి అనే తమిళ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. తెలుగులో నాగ చైతన్య రొమాంటిక్ ఎంటర్టైనర్ ఒక లైలా కోసం చిత్రంతో అడుగుపెట్టారు.

మొదట్లో ఆమెను వరుసగా పరాజయాలు పలకరించాయి. దర్శకుడు త్రివిక్రమ్ ఆమెకు బ్రేక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఆయన కాంపౌడ్ హీరోయిన్ గా మారిపోయిన పూజా దశ తిరిగింది. దాదాపు ఫేడ్ అవుట్ అవుతున్న దశలో అరవింద సమేత వీరరాఘవ మూవీలో ఆఫర్ ఇచ్చాడు. అప్పటికి పూజా వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. అరవింద సమేత హిట్ టాక్ తెచ్చుకోగా, మహర్షి మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. అలా స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయ్యింది.

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన అల వైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ నమోదు చేసింది. అయితే 2022 పూజాకు ఝలక్ ఇచ్చింది. వరుస డిజాస్టర్స్ తో ఆమె డీలా పడ్డారు. రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమె 2023 ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 28, కిసీ కా భాయ్ కిసీ జాన్ చిత్రాల్లో పూజా హెగ్డే నటిస్తున్నారు.