Deepika Pilli: దీపికా పిల్లి అంటే బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు సోషల్ మీడియా సెలెబ్రిటీగా ఉన్న దీపికా స్టార్ యాంకర్ అయ్యారు. దీపికా అనతికాలంలో గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పొచ్చు. దీపికా పిల్లిది విజయవాడ. కేఎల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. చిన్నప్పటి నుండి నటన అంటే ఇష్టం. దీంతో టిక్ టాక్ వీడియోలు చేయడం స్టార్ట్ చేసింది. సదరు సోషల్ మీడియా యాప్ లో దీపికాకు విపరీతమైన ఫాలోయింగ్ సొంతమైంది.

దీపికా టిక్ టాక్ వీడియోలకు లక్షల్లో ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఏకంగా 10 మిలియన్స్ కి పైగా ఆమెను ఫాలో అయ్యేవారు.ఇండియా 2020లో టిక్ టాక్ బ్యాన్ చేసింది. దీంతో ఆమె ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరించారు. యూట్యూబ్ ద్వారా మరింత పాపులర్ అయ్యారు. సోషల్ మీడియా సెలెబ్రెటీగా ఎదిగిన దీపికాకు బుల్లితెర ఆఫర్స్ వచ్చాయి. అనూహ్యంగా పాప్యులర్ డాన్స్ రియాలిటీ ఢీ లో యాంకర్ గా చేసే ఛాన్స్ దక్కింది.

ఢీ సీజన్ 13లో రష్మీ గౌతమ్ తో పాటు యాంకర్ గా వ్యవహరించారు. తన గ్లామర్, ముద్దు ముద్దు మాటలతో ఆడియన్స్ ని అలరించి ఫేమ్ తెచ్చుకున్నారు. సదరు సీజన్లో హైపర్ ఆది ఆమెతో రొమాన్స్ చేశాడు. అయితే ఢీ 14 నుండి తప్పించడం జరిగింది. దీపికాతో పాటు రష్మీ, సుడిగాలి సుధీర్ ఢీ షోకి దూరమయ్యారు. అయినప్పటికీ దీపికా పిల్లికి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.

ఆహాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ అనే షోలో దీపికా సందడి చేస్తున్నారు. సుడిగాలి సుధీర్, దీపికా ఈ షో యాంకర్స్ గా ఉన్నారు. కాగా గత ఏడాది ఆమె సిల్వర్ స్క్రీన్ పై కనిపించడం విశేషం. వాంటెడ్ పండుగాడ్ మూవీలో దీపికా పిల్లి నటించారు. అనసూయ, సునీల్, వెన్నెల కిషోర్ వంటి స్టార్స్ వాంటెడ్ పండుగాడ్ చిత్రంలో నటించారు. దీపికా పిల్లి సైతం ఒక రోల్ చేశారు.
వాంటెడ్ పండుగాడ్ అనుకున్న స్థాయిలో ఆడలేదు. హీరోయిన్ కావాలన్నది దీపికా అసలు లక్ష్యం. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసమే హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ వేదికగా అందాల ప్రదర్శన చేస్తుంది. తాజాగా దీపికా ట్రెండీ దుస్తుల్లో హాట్ హాట్ ఫోజులతో మెస్మరైజ్ చేశారు. దీపికా గ్లామర్ సాగర తీరాన్ని హీటెక్కిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.