Hyderabad Ganja Found: ట్రైన్ నుంచి విసిరేసిన బ్యాగ్ విప్పి చూస్తే షాక్ అయిన పోలీసులు

Hyderabad Ganja Found: తెలంగాణలో మత్తు పదార్థాల సరఫరా ఆగడం లేదు. ఇదివరకే పలు పార్టీల్లో మత్తు పదార్థాలు పట్టుకున్న పోలీసులు వాటి రవాణాపై కన్నేసి అడ్డుకట్ట వేయాలని భావించినా కుదరడం లేదు. ఏదో ఒక రూట్లో గంజాయి వ్యాపారం గుప్పుమంటూనే ఉంది. దీంతో పోలీసులకు పెను సవాలుగా మారుతోంది. భాగ్యనగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నా వారి ఆశయం నెరవేరడం లేదు. సరికదా ఇంకా ఎక్కువగా రవాణా జరుగుతోన్నట్లు తెలుస్తోంది. అడ్డగుట్ట వడ్డెర బస్తీ […]

Written By: Srinivas, Updated On : June 6, 2022 4:22 pm
Follow us on

Hyderabad Ganja Found: తెలంగాణలో మత్తు పదార్థాల సరఫరా ఆగడం లేదు. ఇదివరకే పలు పార్టీల్లో మత్తు పదార్థాలు పట్టుకున్న పోలీసులు వాటి రవాణాపై కన్నేసి అడ్డుకట్ట వేయాలని భావించినా కుదరడం లేదు. ఏదో ఒక రూట్లో గంజాయి వ్యాపారం గుప్పుమంటూనే ఉంది. దీంతో పోలీసులకు పెను సవాలుగా మారుతోంది. భాగ్యనగరాన్ని గంజాయి రహిత నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నా వారి ఆశయం నెరవేరడం లేదు. సరికదా ఇంకా ఎక్కువగా రవాణా జరుగుతోన్నట్లు తెలుస్తోంది.

Hyderabad Ganja Found

అడ్డగుట్ట వడ్డెర బస్తీ ప్రాంతానికి చెందిన గగులోతు కార్తీక్ (23) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి రైలు పట్టాలపై గంజాయి నార్కోటిక్ పదార్థాలు కలిపిన నాలుగు కిలోల బ్యాగును గుర్తు తెలియని వ్యక్తులు రైలు నుంచి బయటకు విసిరేయడంతో అది కార్తీక్ కు దొరికింది. దాన్ని తెరిచి చూడగా అందులో గంజాయి ఉంది. దీంతో దాన్ని తీసుకొచ్చి బయట విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని సోదా చేయగా అతడి ఇంట్లో రూ.1.03 లక్షల విలువ చేసే గంజాయి నార్కోటిక్ కలిపిన పదార్థాలు దొరికాయి. దీంతో అతడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి ఇచ్చారు? అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

Also Read: Nityananda Swamy: అట్లుంటది నిత్యానందతోని!.. సమాధిలోకి స్వయం ప్రకటిత దేవుడు..

నగరంలో చాలా ముఠాలు గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీసులు ఎంత ప్రయత్నించినా వారు ఏదో ఒక మార్గంలో రవాణా చేస్తూనే ఉన్నారు. దీంతో పోలీసులు పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా గుట్టు దొరికితే దాని డొంకంతా కదిలించలని ప్రయత్నిస్తున్నారు. కానీ వాటి అక్రమ రవాణాకు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు . ఫలితంగా మూడు ప్యాకెట్లు ఆరు బ్యాగులు అన్న చందంగా గంజాయి వ్యాపారం జోరుగా సాగుతోంది.

ఈ నేపథ్యంలో గంజాయి గుట్టు లాగేందుకు ఎంత వెతికినా దాని మూలాలు మాత్రం దొరకడం లేదు. ఇందులో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు సైతం పాలుపంచుకుని దందా కొనసాగించడం విశేషం. అంత లాభం ఉన్న దందా కావడంతో గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తూ పోలీసుల కళ్లు గప్పుతున్నారు. కానీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా గంజాయి దందా రట్టు సాధ్యం కావడం లేదు. ఇంకా ఎక్కువ మంది ఇందులో పాల్గొని లక్షలు సంపాదిస్తున్నట్లు సమాచారం. గతంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఇందులో పట్టుబడటంతో దందా ఎలా సాగుతుందనే దానిపై ఓ స్పష్టత వచ్చింది. కానీ దాన్ని దెబ్బతీయడం మాత్రం కుదరడం లేదు.

Hyderabad Ganja Found

ఈ క్రమంలో గంజాయి రవాణా చేసే వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నా వారు ఏదో విధంగా తప్పించుకుంటున్నారు. గంజాయి వ్యాపారం చేసే వారి వివరాలు తెలుసుకుంటూ ఆరా తీస్తున్నా వారు మాత్రం చిక్కడం లేదు. దీంతో గంజాయి రవాణా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీనిపై ఫోకస్ పెట్టిన పోలీసులకు అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడ విక్రయిస్తున్నారు? ఎవరు తీసుకుంటున్నారనే దానిపై స్పష్టత రావడం లేదు. దీంతోనే గంజాయి వ్యాపారం నగరంలో విచ్చలవిడిగా కొనసాగుతుందనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి పోలీసులు ఎంత ప్రయత్నించినా గంజాయి వ్యాపారం మాత్రం నిలవడం లేదు. కానీ ఇంకా ఎక్కువే అవుతోంది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దానిపైనే మల్లగుళ్లాలు పడుతున్నారు.

Also Read:BJP- Congress and TRS: తెలంగాణలో ముక్కోణపు పోటీలో మునిగేదెవరో? తేలేదెవరో?

Tags